ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పూర్తి ఉచితంగా పేదలకు ఇళ్లు

ABN, First Publish Date - 2020-12-20T04:49:38+05:30

రాష్ట్రంలోని పేదలకు ఈనెల 25 పేదలకు 300 చదరపు అడుగుల ఇళ్లను పూర్తి ఉచితంగా ప్రభుత్వం ఇస్తున్నట్లు మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.

మాట్లాడుతున్న మునిసిపల్‌శాఖామంత్రి బొత్స సత్యనారాయణ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటిపన్నుపై అపోహలు వద్దు

మంత్రి బొత్స సత్యనారాయణ

చిలకలూరిపేటలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

 

చిలకలూరిపేట, డిసెంబరు 19: రాష్ట్రంలోని పేదలకు ఈనెల 25 పేదలకు 300 చదరపు అడుగుల ఇళ్లను పూర్తి ఉచితంగా ప్రభుత్వం ఇస్తున్నట్లు మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. చిలకలూరిపేటలో శనివారం అభివృద్ధి పనుల ప్రారంభోత్స కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పేదల బతుకులు మార్చేలా సీఎం జగన్మోహనరెడ్డి పరిపాలన సాగిస్తున్నారని తెలిపారు. ఇంటి పన్ను విషయంలో అపోహలు వద్దన్నారు.  10 నుంచి 15 శాతానికి మించి పన్నులు పెరగవన్నారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి చెరుకువాడ శ్రీరంగనాఽథరాజు మాట్లాడుతూ చిలకలూరిపేట నియోజకవర్గానికి దాదాపు 20వేల ఇళ్లు మంజూరైనట్లు తెలిపారు. ఇళ్ల నిర్మాణం పూర్తయితే ఒక్కో ఇంటి ఖరీదు రూ.10లక్షల వరకు ఉంటుందన్నారు. ఎమ్మెల్యే విడదల రజిని మాట్లాడుతూ నియోజకవర్గంలో రూ.20కోట్ల నిధులతో త్వరలో రెసిడెన్షియల్‌ పాఠశాల నిర్మించబోతున్నామన్నారు. ముస్లింల శ్మశానవాటిక, ఆటోనగర్‌ సమస్యలను త్వరలో తీరుస్తామన్నారు. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ చిలకలూరిపేటలో 100 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. అమృత్‌స్కీమ్‌, వాటర్‌ గ్రిడ్‌ అనుసంధాన పథకాల ద్వారా ప్రతి ఇంటికి నీటి సదుపాయం లభిస్తుందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే అంబటి రాంబాబు, డీసీసీబీ చైర్మన్‌ రాతంశెట్టి సీతారామాంజనేయులు, వైసీపీ నాయకులు కావటి  మనోహర్‌నాయుడు, మార్కెట్‌యార్డు చైర్మన్‌ బొల్లెద్దు చిన్నా, హౌసింగ్‌ పీడీ వేణుగోపాలరావు, పలువురు అధికారులు, వైసీపీ నేతలు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-20T04:49:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising