ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వేర్వేరు కేసుల్లో ఇద్దరు నిందితుల అరెస్టు

ABN, First Publish Date - 2020-10-24T10:29:56+05:30

ద్యోగాలు ఇప్పిస్తా మంటూ మోసగిం చిన ఓ నిందితుని తో పాటు సామాజి క మాధ్యమాల్లో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై అసభ్యపదజాలంతో పోస్టు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంగళగిరి క్రైమ్‌, అక్టోబరు 23: ఉద్యోగాలు ఇప్పిస్తా మంటూ మోసగిం చిన ఓ నిందితుని తో పాటు సామాజి క మాధ్యమాల్లో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై అసభ్యపదజాలంతో పోస్టు చేసిన ఘటనలో మరో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. శుక్ర వారం పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో సీఐ శ్రీనివాసులరెడ్డి, ఎస్‌ఐ నారాయణతో కలసి వారి వివరాలను వెల్లడించారు. పాత మంగళగిరి సీతారామ కోవెలకు చెందిన కారంచేటి మణికాంత్‌ అనే నిరుద్యోగికి ఏపీ ట్రాన్స్‌కోలో ఏఈ ఉద్యోగం ఇప్పిస్తానని కొత్తపేటకు చెందిన గాలి వెంకట లారెన్స్‌ 23 లక్షలు నగదు తీసుకున్నాడు.


మూడేళ్లు గడి చినా ఉద్యోగం ఇప్పించక పోవడంతో నగదును తిరిగి ఇవ్వాలని మణికాంత్‌ ఎన్నోమార్లు లారెన్స్‌ను అడుగుతున్నా పట్టించు కోలే దు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసి లారెన్స్‌ను అరెస్టు చేశారు. ఇదే కేసులో మరో నిందితుడు కే సునీల్‌కుమార్‌ పరారీలో ఉన్నట్లు సీఐ తెలిపారు.  ప్రభుత్వ సలహాదారు అజేయ కల్లం పేరుతో కరకట్ట కమల్‌ గ్యాంగ్‌ దందా లు అంటూ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై సామాజిక మాధ్య మాల్లో ఇటీవల అశ్లీల పోస్టు చేసిన లక్ష్మీ నరసింహస్వామి కాలనీ కి చెందిన కే వేణును అరెస్టుచేసినట్లు తెలిపారు. నిందితులను రిమాండ్‌ నిమిత్తం కోర్టుకు హాజరుపర్చనున్నట్లు తెలిపారు.

Updated Date - 2020-10-24T10:29:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising