ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గంజాయి విక్రయిస్తున్న ఏడుగురు అరెస్టు

ABN, First Publish Date - 2020-11-14T04:28:36+05:30

గంజాయి విక్రయిస్తున్న ఏడుగురిని అరెస్టు చేసి వారి నుంచి మూడున్నర కిలోల గంజాయి, రూ.3,500 నగదు సీజ్‌ చేసినట్లు ఈస్ట్‌ డీఎస్పీ బి.సీతారామయ్య తెలిపారు.

వివరాలు వెల్లడిస్తున్న ఈస్ట్‌ డీఎస్పీ శీతారామయ్య, సీఐ ఫిరోజ్‌, వెనుక నిందితులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మూడున్నరకిలోల గంజాయి, రూ.3,500 నగదు సీజ్‌

విశాఖ ఏజన్సీ నుంచి అక్రమ రవాణ

గుంటూరు, నవంబరు 13:  గంజాయి విక్రయిస్తున్న ఏడుగురిని  అరెస్టు చేసి వారి నుంచి మూడున్నర కిలోల గంజాయి, రూ.3,500 నగదు సీజ్‌ చేసినట్లు ఈస్ట్‌ డీఎస్పీ బి.సీతారామయ్య తెలిపారు. శుక్రవారం అరండల్‌పేట స్టేషన్‌లో విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఏటుకూరు రోడ్డులో గల కమ్మ శేషయ్య గ్రౌండ్స్‌లో కొందరు పోలీసులకు సమాచారం అందింది. సీఐ ఫిరోజ్‌ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం పోలీస్‌ సిబ్బంది గ్రౌండ్స్‌కు వెళ్లి దాడి చేయగా కొంతమంది పారిపోతుండగా పట్టుకుని తనిఖీలు చశారు. సంగడిగుంటకు చెందిన షేక్‌ గౌస్‌బాషా, అందుగుల కుమార్‌ బాబు, షేక్‌ మస్తాన్‌వలి, మేడికొండూరు విశాల్‌ కుమార్‌,  ఇస్మాయిల్‌, కొత్తపేటకు చెందిన సావనిహేమంత్‌,  బావాజీనగర్‌ కు చెందిన జిన్నాబత్తిన భరత్‌లను అరెస్ట్‌ చేసి వారి నుంచి గంజాయి స్వాధీనం చేసుకున్నారు. లంబసింగిలో నందు అనే వ్యక్తి నుంచి గంజాయి కొనుగోలు చేసి తీసుకువచ్చి ఇక్కడ విక్రయిస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు. నిందితులను అరెస్ట్‌ చేసిన లాలాపేట సీఐ ఫిరోజ్‌, హెడ్‌ కానిస్టేబుల్‌డి శ్రీనివాసరావు, కానిస్టేబుళ్లు ఎస్‌కే  నాగూర్‌వలి, టి.శ్రీనివాసరావు, వి.చినవెంకట్రావు, ఎన్‌.శామ్యూల్‌రాజ్‌, పి.గోవిందరావు తదితరులను డీఎస్పీ అభినందించారు. అసాంఘిక కార్యకలాపాలు జరుగుతుంటే తన ఫోన్‌ నెంబర్‌ 8688831309కు సమాచారం ఇవ్వాలని సూచించారు.

Updated Date - 2020-11-14T04:28:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising