పవర్స్ర్పేయర్లో పెట్రోలు పోస్తుండగా మంటలు
ABN, First Publish Date - 2020-10-19T09:53:01+05:30
పవర్‌స్ర్పేయర్లో పెట్రోలు పోస్తుండగా మంటలు
గురజాల, అక్టోబరు 18: మండలంలోని సమాధానంపేట గ్రామంలోని తమ ఇంట్లో ఆదివారం పవర్ స్ర్పేయర్‌లో పెట్రోలు పోస్తుండగా మంటలు చెలరేగిన ఘటనలో భార్య మృతిచెందగా, భర్తకు తీవ్రగాయాలయ్యాయి. ఎస్‌ఐ బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం... సమాధానంపేట గ్రామానికి చెందిన బాణావత్తు రాములునాయక్ పొలం పనులకు వినియోగించే పవర్‌స్ర్పేయర్‌లో పెట్రోలు నింపుతున్న సమయంలో ప్రమాదవశాత్తు మంటలు వచ్చి, రాములు, జానమ్మ దంపతులకు తీవ్రగాయలయ్యాయి. దీంతో ఇద్దర్నీ గురజాల సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా మెరుగైన చికిత్సనిమిత్తం గుంటూరు తరలించారు. గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్ను జానమ్మ (50) మృతి చెందింది. దీనిపై విచారణ చేస్తున్నట్లు ఎస్‌ఐ బాలకృష్ణ తెలిపారు.
Updated Date - 2020-10-19T09:53:01+05:30 IST