ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అవమానాలు.. అవహేళనలు

ABN, First Publish Date - 2020-10-19T09:50:58+05:30

అవమానాలు.. అవహేళనలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అసభ్యకర పోస్టింగ్‌లు పెట్టిన వారిపై చర్యలేవి

తుళ్లూరు పోలీస్‌స్టేషన్‌ ఎదుట మహిళల ఆందోళన

306వ రోజూ కొనసాగిన అమరావతి రైతుల దీక్షలు


తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి, తాడికొండ అక్టోబరు 18: రాజధాని కోసం భూములు ఇచ్చినందుకు అవమానాలు.. అవహేళనలా అని అమరావతి ప్రాంత మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ ఆ ప్రాంత రైతులు, మహిళలు చేస్తోన్న ఉద్యమం ఆదివారానికి 306వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సామాజిక మాధ్యమాల్లో రాజధాని మహిళలపై అసభ్యకర పోస్టింగ్‌లు పెడుతూ అవహేళన చేస్తున్నారన్నారు. వారిపై చర్యలు ఎందుకు తీసుకోవటం లేదని ప్రశ్నించారు. అధికార పార్టీ  నాయకులకు ఒక న్యాయం, సామాన్యులకు ఒక న్యాయమా మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిని అభివృద్ధి చేయకుండా బయట ప్రాంతం పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని ప్రభుత్వం చెప్పటంలో కుట్ర దాగుందన్నారు. అసభ్యకర పోస్టింగ్‌లు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ మహిళలు, రైతులు, దళిత జేఏసీ సభ్యులు తుళ్లూరు పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ఆందోళన చేశారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. 


- తాడేపల్లి మండలం పెనుమాకలో జరుగుతున్న దీక్షలు 306వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఐకాస ప్రతినిధులు మాట్లాడుతూ అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించే వరకు ఉద్యమం కొనసాగిస్తామన్నారు. మొండి ప్రభుత్వానికి ప్రజలు త్వరలోనే బుద్ధి చెబుతారని తెలిపారు.  

- అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని కోరుతూ మంగళగిరి మండలం కృష్ణాయపాలెం, యర్రబాలెం, నవులూరు, బేతపూడి, నిడమర్రు, నీరుకొండ గ్రామాల్లో జరుగుతున్న దీక్షలు ఆదివారంతో 306వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా రైతు సంఘ నేతలు మాట్లాడుతూ అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించి, మూడు రాజధానుల ప్రకటనను విరమించుకోవాలని కోరారు.

- మూడు రాజధానులకు వ్యతిరేకంగా తాడికొండ మండలం మోతడక గ్రామంలో రైతులు, మహిళలు ఆదివారం నిరసనలు కొనసాగించారు.  ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ వరదలతో అమరావతిని ముంచటానికి ప్రయత్నిస్తున్నారన్నారు. 305 రోజులగా రాజధానిలో రైతులు నిరసనలు వ్యక్తం చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోకుండా వారిపై కేసులు పెట్టి మానసికంగా హింస్తున్నారని తెలిపారు. 


Updated Date - 2020-10-19T09:50:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising