ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వాణిజ్య పంటల ముంపునకు కేఎల్‌యూనే కారణం

ABN, First Publish Date - 2020-10-22T10:35:35+05:30

వాణిజ్య పంటల ముంపునకు కేఎల్‌యూనే కారణం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మురుగు కాల్వపై అక్రమ నిర్మాణాలు

750ఎకరాల్లోని వాణిజ్య పంటలకు నష్టం

వామపక్ష రాష్ట్ర నేతలు రామకృష్ణ, మధు


తాడేపల్లి, అక్టోబర్‌ 21: పంటపొలాల్లో వర్షపు మురుగు నిలిచిపోయి, నీరు పారే దారిలేక సుమారు 750 ఎకరాల వాణిజ్య పంటలు నష్టపోవడానికి కేఎల్‌ యూనివర్సిటీ మురుగుకాలువపై అక్రమంగా నిర్మించిన నిర్మాణాలే కారణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు ఆరోపించారు. బుధవారం గుండిమెడ గ్రామంలో సీపీఐ, సీపీఎం, టీడీపీ, ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం నాయకులు, రైతుల అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ సీఎం జగన్‌ నివాసం ఉండే ప్రాంతంలో భారీవర్షాలతో రైతులు పండించిన పంటలకు తీవ్రంగా నష్టం వాటిల్లిందని, ముఖ్యంగా కుంచనపల్లి, గుండిమెడ, కొలనుకొండ, వడ్డేశ్వరం, మెల్లెంపూడి, చిర్రావూరు ప్రాంతాల్లో అరటి, పసుపు, కంద, బొప్పాయి, పుదీన ఆకుకూర తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని చెప్పారు. కేఎల్‌ యూనివర్సిటీ వారు మురికికాలువపై అక్రమ నిర్మాణాలు చేపట్టడంద్వారా మురుగునీరు పోయే దారిలేక వర్షపునీరు పొలాల్లో నిలవడంతో రైతులు నిండా మునిగారని ఆందోళన వ్యక్తం చేశారు. మధు మాట్లాడుతూ వాణిజ్య పంటల నష్టాన్ని  ప్రభుత్వం లేక కేఎల్‌ యూనివర్సిటీ  భరించాలని డిమాండ్‌ చేశారు. పొలాల్లో నిలిచిన మురుగు నీటిని వెంటనే తొలగించాలని, అధికారులు బాధ్యతతో వ్యవహరించాలని హెచ్చరించారు. రాష్ట్రంలో చాలా ప్రాంతాలలో మురుగుకాలువలపై అక్రమ నిర్మాణాల కారణంగా పంట పొలాలు పాడైపోయాయన్నారు. వీటన్నింటిపై విచారణ జరిపించి రైతులకు న్యాయంచేయాలని మధు డిమాండ్‌చేశారు. తొలుత నీటమునిగిన పంట పొలాలను అఖిలపక్ష నేతలు పరిశీలించారు. 


అఖిలపక్ష సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్‌, నాయకులు చిన్ని తిరుపతయ్య, కంచర్ల కాశయ్య, జాన్‌బాబు, యార్లగడ్డ వెంకటేశ్వర్లు, సీపీఎం తాడేపల్లి కార్యదర్శి దొంతిరెడ్డి వెంకటరెడ్డి, అమ్మిశెట్టి రంగారావు, కాజ వెంకటేశ్వరరావు, శ్రీనివాసరెడ్డి, టీడీపీ నాయకులు పఠాన్‌ ఖాసింఖాన్‌, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-22T10:35:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising