ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుంటూరులో.. పెరిగిన కేసులు

ABN, First Publish Date - 2020-10-22T10:33:20+05:30

గుంటూరులో.. పెరిగిన కేసులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): గుంటూరు నగరంలో మళ్లీ ఒకే రోజులో వంద కేసులు దాటా యి. ఇటీవల రెండంకెల్లోనే కేసులు వస్తుండటంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. కాని బుధవారం జిల్లావ్యాప్తంగా 396 కేసులు రాగా గుంటూరు నగరంలో 109 కేసులు రావడంతో ప్రజలు ఆందో ళన చెందుతున్నారు. బుధవారం ఉదయం వరకు వివిధ ల్యాబ్‌ల నుంచి 6,035 శాంపిల్స్‌ ఫలితాలు అందగా 396(6.56 శాతం) మందికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో ఇప్పటివరకు వైరస్‌ సోకిన వారి సంఖ్య 65,083 మందికి చేరింది.  కరోనాతో పోరాడి మరో ముగ్గురు చనిపోవడంతో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 657కి పెరిగింది. ప్రస్తుతం 3,628(5.57 శాతం) మంది చికిత్స పొందుతున్నారు. ప్రతీ 10 లక్షల మంది జనాభా లో 1,32,719 మందికి టెస్టులు నిర్వహించినట్లు డీఎంహెచ్‌వో డాక్టర్‌ జే యాస్మిన్‌ తెలిపారు. కొత్తగా గుంటూరు నగరంలో 109 మందికి, తెనాలి - 24, నరసరావుపేట - 22, మంగళగిరి - 18, బాపట్ల - 17, వినుకొండ - 17, తాడేపల్లి - 16, మాచర్ల - 16, వట్టిచెరుకూరు - 14, కొల్లూరు - 12, రొంపిచర్లలో 10 మందికి పాజిటివ్‌ వచ్చింది. మిగిలిన మండలాల్లో మరో 121 కేసులు నమోదయ్యాయి. 

Updated Date - 2020-10-22T10:33:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising