ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతులను దగా చేస్తున్న వైసీపీ సర్కార్: అనగాని

ABN, First Publish Date - 2020-10-27T17:33:54+05:30

రైతు భరోసా పేరుతో వైసీపీ ప్రభుత్వం రైతులను దగా చేస్తోందని టీడీపీ నేత అనగాని సత్యప్రసాద్ వ్యాఖ్యానించారు. రూ.1.50 లక్షలు ఇచ్చిన వారిని విమర్శించి.. రూ. 7,500 ఘనమని ప్రచారం చేసుకుంటున్నారని వైసీపీ నేతల తీరుపై ధ్వజమెత్తారు. మంగళవారం నాడు ఇక్కడ మీడియాతో మాట్లాడిన...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రైతు భరోసా పేరుతో వైసీపీ ప్రభుత్వం రైతులను దగా చేస్తోందని టీడీపీ నేత అనగాని సత్యప్రసాద్ వ్యాఖ్యానించారు. రూ.1.50 లక్షలు ఇచ్చిన వారిని విమర్శించి.. రూ. 7,500 ఘనమని ప్రచారం చేసుకుంటున్నారని వైసీపీ నేతల తీరుపై ధ్వజమెత్తారు. మంగళవారం నాడు ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన.. రైతు ద్రోహానికి జగన్ రెడ్డి కేరాఫ్ అడ్రస్ అని వ్యాఖ్యానించారు. ఓవైపు తడిగుడ్డతో రైతు గొంతు కోస్తూ.. మరోవైపు రైతు భరోసా పేరుతో హడావుడి చేస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కోటి మంది రైతులంటూ ప్రకటించిన వైసీపీ నేతలు.. నేడు అంతా తూచ్ 50 లక్షల మందే రైతులు అంటూ దగా చేస్తున్నారని ధ్వజమెత్తారు. 15 లక్షలకు పైగా ఉన్న కౌలు రైతులను ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు. గిరిజనులు, కౌలు రైతులు కేవలం లక్ష మందే అంటూ ప్రకటించడం దారుణమన్నారు. ఇచ్చేది రూ. 7,500 అయితే ప్రచారంలో మాత్రం రూ.13,500 అని చెప్పుకుంటున్నారని ధ్వజమెత్తారు. వరదల కారణంగా లక్షలాది ఎకరాల్లో పంటలు మునిగిపోతే కనీసం పరామర్శించలేదన్నారు. పైగా పరామర్శించే వారిపై తప్పుడు కేసులు పెడుతున్నారని సత్యప్రసాద్ విమర్శించారు. రైతుల పాలిట రాబందులా జగన్ రెడ్డి తీరు ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో అమరావతి అంశంపైనా అనగాని సత్యప్రసాద్ తీవ్రంగా స్పందించారు. అమరావతి రైతులపై పెయిడ్ ఆర్టిస్టులతో తప్పుడు కేసులు పెట్టిస్తున్నారని ఆరోపించారు. రైతు ప్రభుత్వం అని ప్రకటించుకునే అర్హత జగన్ ప్రభుత్వానికి లేదని సత్యప్రసాద్ ఉద్ఘాటించారు.

Updated Date - 2020-10-27T17:33:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising