ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజధాని అమరావతిని కొనసాగాలి

ABN, First Publish Date - 2020-07-14T10:02:31+05:30

రాజధాని అమరావతి కోసం 33 వేల ఎకరాలు త్యాగం చేసిన రైతులను వైసీపీ ప్రభుత్వం రోడ్డు పాలు ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

209వ రోజుకు చేరిన రైతుల ఆందోళలు


తుళ్లూరు, తాడికొండ, జూలై 13: రాజధాని అమరావతి కోసం 33 వేల ఎకరాలు త్యాగం చేసిన రైతులను వైసీపీ ప్రభుత్వం రోడ్డు పాలు చేసిందని రైతులు మండిపడ్డారు. అమరావతే రాజధానిగా కొనసాగాలని డిమాండ్‌ చేస్తూ ఆ ప్రాంత రైతులు చేస్తున్న ఆందోళనలు 209వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ రాజధానిలో నిలిపివేసిన పనులు కొనసాగాలని ప్రభుత్వాన్ని కోరారు. రాజధాని ప్రాంతాన్ని ఒక సామాజికవర్గానికి సంబంఽధించినదిగా ప్రచారం చేయటం విడ్డూరంగా ఉన్నదన్నారు. రాష్ట్రం కోసం భూములిచ్చిన రైతులపై కేసులు పెట్టడం దురదృష్టకరం అన్నారు. ఇప్పటికైనా రాజధాని అమరావతి నుంచే పరిపాలన కొనసాగించాలని కోరారు. రాజధాని రైతులకు మద్దతుగా తాడికొండ మండలం పొన్నెకల్లు గ్రామంలో రైతులు, మహిళలు నిరసనలు వ్యక్తం చేశారు. 

Updated Date - 2020-07-14T10:02:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising