ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమరావతితోనే రాష్ట్ర భవిత

ABN, First Publish Date - 2020-03-16T07:09:43+05:30

అమరావతిని కదిలించటం అంటే ఆంధ్రాని కదిలించటమేనని స్వామి కమలానంద భారతి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేయాలన్న కుట్ర సాగుతోంది  

స్వామి కమలానంద భారతి


గుంటూరు, మార్చి 15(ఆంధ్రజ్యోతి): అమరావతిని కదిలించటం అంటే ఆంధ్రాని కదిలించటమేనని స్వామి కమలానంద భారతి అన్నారు. గుంటూరు ఎస్వీఎన్‌ కాలనీలోని ఓ ఫంక్షన్‌ హాల్లో అమరావతి ఆశ్యకత అనే అంశంపై ఆదివారం ఆయన ప్రసంగించారు. మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేయాలన్న కుట్ర సాగుతోందని ఆరోపించారు. గోదావరి నీరు తెలంగాణ మీదుగా సీమకు అందిస్తామన్నప్పుడు ఈ కుట్రకు బీజం పడిందని తెలిపారు. అదే జరిగితే ఆంధ్రాతో సీమకు దూరమవుతుందన్నారు.


అలానే విశాఖ రాజధాని అంటే జై కళింగ ఉద్యమం పురుడుపోసుకుంటుందని చెప్పారు. హైద రాబాదులో ఆస్తులు ఉన్న నేతలు ఆంధ్రా పాలకులుగా ఉన్నంత కాలం రాష్ట్రం అధోగతే అన్నారు. అమరావతితోనే ఆంధ్రా భవిత అని స్వామి కమలానంధ భారతి స్పష్టం చేశారు. కార్యక్రమంలో జేఏసీ నేతలు శివారెడ్డి, తిరుపతిరావు, మల్లికార్జునరావు, స్వామి, నందకిషోర్‌తో పాటు లాయర్లు, ఇంజనీర్లు, లెక్చర్లతో పాటు నగర ప్రముఖులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ముందు ప్రజా గాయకుడు రమణ బృందం అమరావతి ఉద్యమ పాటలు పాడి అందరిని ఆలోచింప జేశారు.  

Updated Date - 2020-03-16T07:09:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising