ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టిడ్కో భవన సముదాయాల్లో ఫ్లాట్లను లబ్ధిదారులకు కేటాయించాలి: కలెక్టర్‌

ABN, First Publish Date - 2020-02-20T07:43:33+05:30

Collector Samuel Anandkumar Guntur Andhra Pradesh

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): ఏపీ టిడ్కో ఆధ్వర్యంలో నిర్మించిన గృహ సముదాయాల్లో లబ్ధిదారులకు ఫ్లాట్లు కేటాయిం చాలని కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌ కుమార్‌ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని డీఆర్‌సీ మీటింగ్‌ హాల్‌లో పట్టణ పరిధిలో నిర్మించిన టిడ్కో గృహ సముదాయాల కేటా యింపులపై టిడ్కో అధికారులు, మునిసిపల్‌ కమిషనర్లతో కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సంద ర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో టిడ్కో పథకం ద్వారా 51,412 గృహాలు మంజూరు కాగా ఇప్పటివరకు 32,192 గృహాల నిర్మాణం పూర్తి అయ్యాయన్నారు. మునిసిపాలిటీల వారీగా పరిశీలన చేసిన లబ్ధిదారుల గృహాల కేటాయింపు ప్రక్రియ ప్రారంభించాలన్నారు. గృహాలు ఎక్కువగా ఉండి లబ్ధిదారులు తక్కువగా ఉంటే అర్హుల జాబితాలోని తర్వాత స్థానంలోని వారికి అవకాశం కల్పించాలన్నారు. గృహాలు తక్కువగా ఉండి లబ్ధిదారుల ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో లాటరీ ద్వారా కేటాయింపులు చేపట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జేసీ ఏఎస్‌ దినేష్‌కుమార్‌, తెనాలి సబ్‌ కలెక్టర్‌ కే దినేష్‌కుమార్‌, జడ్పీ సీఈవో ఛైతన్య, టిడ్కో ఎస్‌ఈ కోటేశ్వరరావు, పీవో ఆదినారాయణ, మునిసిపల్‌ కమిషనర్లు, పట్టణ ప్రణాళిక అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2020-02-20T07:43:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising