ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

16 క్రస్ట్‌గేట్ల ద్వారా నీటి విడుదల

ABN, First Publish Date - 2020-09-22T08:27:13+05:30

ఎగువన ఉన్న జూరాల, శ్రీశైలం ప్రాజెక్ట్‌లకు భారీగా వరద నీరు వచ్చి చేరడంతో నాగార్జునసాగర్‌ ప్రాజెక్ట్‌ 16 క్రస్ట్‌గేట్ల ద్వారా అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు. సోమవారం నాటికి సాగర్‌ నీటిమట్టం 589.50(310.55 టీఎంసీలు) అడుగులు ఉంది. కుడి కాలువ ద్వా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయపురిసౌత్‌, సెప్టెంబరు 21: ఎగువన ఉన్న జూరాల, శ్రీశైలం ప్రాజెక్ట్‌లకు భారీగా వరద నీరు వచ్చి చేరడంతో నాగార్జునసాగర్‌ ప్రాజెక్ట్‌ 16 క్రస్ట్‌గేట్ల ద్వారా అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు. సోమవారం నాటికి సాగర్‌ నీటిమట్టం 589.50(310.55 టీఎంసీలు) అడుగులు ఉంది. 


కుడి కాలువ ద్వారా 8,604 క్యూసెక్కులు, 16 క్రస్ట్‌గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 2,38,624, ఎస్‌ఎల్‌బీసీకి 1,800, ఎడమ కాలువ ద్వారా 3,977, ప్రధాన జలవిద్యుత్‌ కేంద్రం ద్వారా 29,110, మొత్తం 2,82,110 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి 2,82,110 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం నీటిమట్టం 884.40(211.95 టీఎంసీలు) అడుగులుంది.

Updated Date - 2020-09-22T08:27:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising