ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిబంధనలు పాటించకుంటే వ్యాపార సంస్థలను సీజ్ చేస్తాం: కలెక్టర్

ABN, First Publish Date - 2020-06-07T00:29:38+05:30

నిబంధనలు పాటించకుంటే వ్యాపార సంస్థలను సీజ్ చేస్తాం: కలెక్టర్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: కోవిడ్-19 లాక్ డౌన్ నిబంధనలను 8వ తేదీ నుంచి సడలింపులు ఇవ్వడంతో ప్రార్ధనా మందిరాలు, హోటళ్లు, మాల్స్ ఓపెన్ చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ వెల్లడించారు. ప్రతి ఒక్కరూ తప్పని సరిగా నిబంధనలు పాటించాలని, లేకుంటే వ్యాపార సంస్థలను సీజ్ చేసే విధంగా ప్రభుత్వం అధికారాలు జారీ చేసిందని స్పష్టం చేశారు. 60 సంవత్సరాలు పైబడిన వారికి అనుమతి లేదని, ప్రార్ధనా మందిరాలలో బోర్డులు ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. మాల్స్, హోటల్స్, ప్రార్ధనా మందిరాలలో కోవిడ్-19పై తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుపుతూ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. అందరూ ఆరోగ్య సేతు యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలన్నారు.


ప్రతి ఒక్కరికీ ధర్మల్ స్కానింగ్ చేయయాలని, కోవిడ్-19 లక్షణాలు ఉన్నా వాళ్లను మాల్స్ లోకి అనమతించరాదని తెలిపారు. జీఓ నంబర్ 288 ప్రకారం మాల్స్, హోటల్స్, ప్రార్ధనా మందిరాలలో నిబంధనలు పాటించాలని, లేకుంటే చర్యలు తప్పవు కలెక్టర్ హెచ్చరించారు. ప్రార్ధనా మందిరాలలో విగ్రహాలను తాకడం, హోలీ వాటర్ చల్లడం, శఠగోపం పెట్టడం లాంటివి నిషేధించారు. ఎప్పటికప్పుడు ప్రార్ధనా మందిరాలను శానిటైజ్ చేయడంతో పాటు వ్యక్తిగత దూరం పాటించాలన్నారు. హోటల్స్ లో ఎక్కువగా పార్శిళ్ళు ఇచ్చేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని, క్యాష్ లేస్ పేమెంట్స్ మాత్రమే అనుమతించాలని, మాల్స్ లో చిల్డ్రన్స్ గేమింగ్ ఏరియాలను మూసివేయాలని కలెక్టర్ సూచించారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారిపై దయ చూపాలని, వారికి అండగా ఉండాలని, వారిపై వివక్ష చూపవద్దని, సామాజిక దూరం, మాస్క్ లు, శానిటైజేషన్ ఉపయోగించడంద్వారా కరోనాను అడ్డుకోవచ్చని కలెక్టర్ వెల్లడించారు.

Updated Date - 2020-06-07T00:29:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising