ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోల్డ‌్‌స్టోరేజ్ యాజమాన్యం నిర్లక్ష్యం...మిర్చిరైతులకు తీవ్రనష్టం

ABN, First Publish Date - 2020-05-23T14:06:02+05:30

కోల్డ‌్‌స్టోరేజ్ యాజమాన్యం నిర్లక్ష్యం...మిర్చిరైతులకు తీవ్రనష్టం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: జిల్లాలోని రాజుపాలెం మండలం రెడ్డిగూడెం శ్రీ వెంకటేశ్వర కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం నిర్వాహకంతో మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోయారు. గత రెండు వారాలుగా స్టోరేజ్‌లో ఏసీలు పనిచేయని పరిస్థితి నెలకొంది. దీంతో స్టోరేజ్‌లో రైతులు నిల్వ ఉంచిన మిరపకాయలు బూజుపట్టిపోయాయి. సుమారు 20 వేల క్వింటాలు పంట నష్టం వాటిల్లింది. కాగా దీనిపై రైతులకు యాజమాన్యం ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. స్టోరేజ్ వద్దకు వచ్చి అడిగితే సరైన సమాధానం చెప్పకుండా నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించింది. విషయం తెలిసిన వెంటనే రైతులు స్టోరేజ్‌లోని మిరపకాయలను బయటకు తీసి ఆరబోసుకుంటున్నారు. తమకు న్యాయం చేయాలని రోడ్డుపై బైఠాయించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో టిక్కీకి రూ. 400 అద్దె వసూలు చేశారని రైతులు చెబుతున్నారు. యాజమాన్యం తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2020-05-23T14:06:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising