ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విశాఖ ఘటనల వెనుక కుట్ర కోణాలు ఉన్నాయేమో?: ఎమ్మెల్యే అమర్నాథ్

ABN, First Publish Date - 2020-07-15T00:44:49+05:30

విశాఖలో ఎల్జీ పాలిమర్స్ ఘటన తర్వాత వరస ఘటనలు జరగటం వెనక తనకు వ్యక్తిగతంగా అనుమానాలున్నాయని ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: విశాఖలో ఎల్జీ పాలిమర్స్ ఘటన తర్వాత వరుస ఘటనలు జరగటం వెనక తనకు వ్యక్తిగతంగా అనుమానాలున్నాయని ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఈ ఘటనలు వెనక కుట్ర కోణాలు ఉన్నాయేమోనని అనుమానాలు ఉన్నాయని చెప్పారు. వరస ప్రమాదలపై సమగ్ర విచారణ జరపాలని సీఎం జగన్‌ను కోరుతున్నానని పేర్కొన్నారు. ఘటన జరిగిన వెంటనే చంద్రబాబు గాని, టీడీపీ నేతలు స్పందించిన తీరు చూస్తే..విశాఖ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బ కొట్టి, రాజధాని రాకుండా ఆలోచన చేస్తున్నారనే భయం కలుగుతోందన్నారు. ఎప్పుడు మాట్లాడని వలింగమనేని బ్రదర్స్ ఫార్మా సిటీ ఘటన పై మాట్లాడిన తీరు చూస్తే ఏదో కుట్ర ఉందేమో అనుమానం కలుగుతోందని వ్యాఖ్యానించారు. 


2014 లో రాజధాని ప్రాంతం అంటూ భూములు ఇవ్వని రైతులు అరటి తోటలను తగలబెట్టి వైసీపీ మీద ముద్ర వేశారని గుర్తుచేశారు. తోడల్లుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావు రాసిన మనసులో మాట పుస్తకంలోనే చంద్రబాబు ఉద్యమం చేయాలంటే 4, 5 బస్సులు తగలబెట్టాలని స్వహస్థలతో చంద్రబాబు నైజాన్ని వ్యక్తపరిచారని చెప్పారు. శవాల మీద పేలాలు ఏరుకునే రీతిలో చంద్రబాబు ఎక్కడ ఏ ఘటన జరిగితే అందులో దూరిపోయి రాజకీయం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. 


వరస ప్రమాదలపై సీఎం, ప్రభుత్వం నోరు మెదపడం లేదని టీడీపీ ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఎల్జీ పాలిమర్స్ ఘటనపై ప్రజలకిచ్చిన మాట ప్రకారం విచారణ జరిపి దోషులను జైలుకు పంపించామన్నారు. గత 5 ఏళ్ళల్లో చంద్రబాబు హయంలో ఏ ప్రమాదం జరిగినా దోషులను జైలుకు పంపించారా? అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. విశాఖ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బకొట్టే వారిని ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. గతంలో చంద్రబాబు సీఎం పదవికోసం అల్లుడిగా పక్కనే ఇంట్లో ఉంటూ కుట్ర పన్ని, ఎన్టీఆర్ మరణానికి కారకులయ్యారని చెప్పారు. 

Updated Date - 2020-07-15T00:44:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising