ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రణ స్థలం!

ABN, First Publish Date - 2020-02-21T09:14:25+05:30

ఇది తిరుపతి రూరల్‌ మండలంలోని సిద్ధేశ్వర గుట్ట. తిరుపతి నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గుట్టను పెద్దసంఖ్యలో పొక్లైన్లు తవ్వేస్తున్నాయి. ఇదేదో మైనింగ్‌లో భాగమనుకుంటే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పేదల ఇంటి జాగాల పేరిట రచ్చ


ఇది తిరుపతి రూరల్‌ మండలంలోని సిద్ధేశ్వర గుట్ట. తిరుపతి నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గుట్టను పెద్దసంఖ్యలో పొక్లైన్లు తవ్వేస్తున్నాయి. ఇదేదో మైనింగ్‌లో భాగమనుకుంటే పొరపాటే! ఇక్కడ గుట్టను చదును చేసి పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తారట! ఎక్కడో ఉన్న వారు ఇక్కడికి వచ్చి ఇళ్లు కట్టుకుని ఉండాలట! చుట్టు పక్కల చదువుకుందామంటే బడి లేదు. కొందామంటే ఒక్క దుకాణమూ కనిపించదు. ఇది ఎంతమాత్రం నివాసయోగ్య ప్రాంతం కాదు! పచ్చటి అడవిగా మార్చాల్సిన చోటును... ఇలా ఇళ్ల స్థలాలుగా మార్చుతున్న చిత్రమిది!


పేదలను ఆదుకోవాలి! వారికో నీడ కావాలి! అందుకే... పేదల గూడు కోసం ఒక సెంటు స్థలం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఉగాది రోజునే పాతిక లక్షల మందికి ఒకేసారి స్థలాలతో పండగ చేయాలని తీర్మానించింది. మంచిదే! ఇంటి జాగాల కోసం ఎంపిక చేసుకున్న స్థలాలు ఏవి? ‘సేకరణ’ పేరిట అధికారిక జులుం ప్రదర్శిస్తున్నది ఎవరిపైన? ఇది పేదలను ఆదుకోవడమా? లేక... పేదల కోసం మరో పేద కడుపు కొట్టడమా? రాష్ట్రవ్యాప్తంగా ఇదే చర్చ... ఎటు చూసినా దీనిపైనే రచ్చ! ఈ స్థలాల జాతరలో దళితులు, బడుగులే అలుసై పోయారు. అప్పనంగా దొరికినట్లుగా అసైన్డ్‌ భూములపైనే సేకరణ అస్త్రం ప్రయోగిస్తున్నారు. ‘మాకు బువ్వ పెడుతున్న భూములు మేం ఇవ్వం మొర్రో’ అంటున్నా ఒత్తిడి తెస్తున్నారు. మరోవైపు... ‘మీరేం చేస్తారో తెలియదు.


పైసా ఖర్చు కాకుండా పేదలకు జాగాలు వెతికిపెట్టండి’ అని అధికారులకు హుకుం జారీ చేశారు. దీంతో... ఉన్న ఊరుకు ఆమడ దూరంలో కొండల్లో కోనల్లో స్థలాలు చూపించి.. సెంటు స్థలంలో పండగ చేసుకోండి అని పేదలతో పరిహాసమాడుతున్నారు. తిరుపతి రూరల్‌ పరిధిలోని సిద్ధేశ్వరుడి కొండను పదులకొద్దీ పొక్లైన్లతో పిండి చేస్తున్నారు. ఇక... స్థలాల వేటలో పడిన అధికారులను పాఠశాలలు, విద్యా సంస్థలు తెగ ఊరిస్తున్నాయి. అసలు సంగతేమిటంటే... ఈ భూస్వాధీన సంగ్రామంలో పెద్దలు, అస్మదీయులకు ఎక్కడా ‘గాయం’ కావడం లేదు. వారి భూములు మాత్రం భద్రంగా ఉంటున్నాయి. దళితులు, పేదలు, నోరులేని వారు... ప్రశ్నించలేని సంస్థల స్థలాలే బలి! ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా అనేక చోట్ల జరుగుతున్న ‘స్థలం’ రణంపై భూ స్వాధీన బాగోతంపై...

‘ఆంధ్రజ్యోతి’ అందిస్తున్న కథనాల సమాహారం..


స్థలాల వేటలో నయా నీతి

పేదలకోసం పేదలనే కొట్టి

కృష్ణాలో సేకరణ ప్రయత్నం

సీఎం బంధువు ఆధీనంలో

భారీగా అసైన్డు భూములు

వాటి జోలికే వెళ్లని రెవెన్యూ

విజయవాడ, ఫిబ్రవరి 20 (ఆం ధ్రజ్యోతి): కృష్ణాజిల్లాలోని చాలా ప్రాంతాల్లో పేదలకు ప్రభుత్వం ఇచ్చి న భూములు ఏదో కారణంతో పెద్దలు తమ చేతుల్లో పెట్టుకొన్నారు. పేదలకు స్థ లాలు ఇస్తున్నారనగానే ఈ భూములను ప్రభు త్వం విముక్తం చేస్తుందని అంతా భావించారు. కానీ, పేదలకు పెట్టడానికి ఆ పేదలనే కొట్టే కొత్త నీతికి సర్కారు తె రతీసింది. కృష్ణాజిల్లాలో ఎస్సీలకు సాగుకోసం ఇచ్చిన అసైన్డ్‌ భూములు సీఎం సమీప బంధువు ఆఽధీనంలో ఉన్నాయి. గణపవరంలో 18 ఎకరాలు, కోడూరులో 18 ఎకరాలు కలిపి 36 ఎకరాలు పేద దళితులకు ఇవ్వగా, అవన్నీ ఆయన స్వాధీనంలోనే ఉన్నాయి. స్థలాల వేటలో ఉన్న అధికారులు.. ఈ భూముల వంక కన్నెత్తి చూడటం లేదు. అదేసమయంలో దళితులు సా గుచేసుకొంటున్న స్థలాలను దౌర్జన్యంగా లాగేసుకొంటున్నారు.


తోట్లవల్లూరు బంగ్లాతోటలోని ఆర్‌ఎ్‌సనెం 166లో 40 సంవత్సరాల నుంచి 9.92 ఎకరాల ప్రభుత్వ భూ ములను దళితులు సాగు చేసుకుంటున్నారు. వారు అడ్డుపడినా, కాళ్లావేళ్లా పడినా, చివరకు  పురుగుల మందు చేతపట్టి ఆత్మహత్యలకు పాల్పడతామని బెదిరించినా అధికారులు ఈ భూములు తీసేసుకొన్నారు. ప్లాట్లు వేసి, పంపిణీకి సిద్ధం చేసేశారు. రుద్రవరంలో దళితులు సాగుచేసుకొంటున్న 4 ఎకరాల భూమిని వారికి తెలియకుండానే లాగేసుకొన్నారు. రాత్రికి రా త్రి ఏకంగా రోడ్డూ వేసేశారు. వారంతా కోర్టుకు వెళ్లగా, రెవె న్యూ యంత్రాంగం కాళ్లబేరానికి వచ్చింది. భూమికి భూమిని ఇస్తామని, మరో ప్రాంతంలో ఇస్తామంటూ రైతులతో చర్చలు ప్రారంభించారు. అంబాపురంలో 30 ఏళ్ల క్రితం 48 మంది రైతులకు 25సెంట్ల చొప్పున సుమారు 12 ఎకరాలను పంపిణీ చేశారు. ఈ భూముల స్వాధీనానికి తహశీల్దార్‌ వనజాక్షి ప్ర యత్నించగా, లబ్ధిదారులు కోర్టును ఆశ్రయించి ఊరట పొందారు. 


భయపెట్టి రాజధానిలో పంపిణీ

గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలంలో నివేశనస్థలాలకు అర్హులంటూ అధికారులు సుమారు 2500 మందితో జాబితా సిద్ధం చేశారు. అయితే, మండలంలో పంచడానికి స్థలాలు లేవంటూ అఽధికారులు వీరికి రాజధాని ప్రాంతంలో భూములు ఇవ్వడానికి సిద్ధమయ్యారు. దీనికోసం నిర్వహించిన గ్రామసభలపై లబ్ధిదారులు ఆసక్తి కనపరచలేదు. భవిష్యత్‌లో రాజధాని గ్రామాలన్నీ అభివృద్ధి చెందుతాయని, కొన్ని మున్సిపాలిటీల్లో విలీనం చేస్తారని స్థలాల విలువ పెరుగుతుందని నచ్చచెప్పే ప్రయత్నం చేసినా సుముఖత చూడటం లేదు. ‘చివరి చాన్సు ఇదే..ఇకపై స్థలాలు ఇవ్వబోం’ అని చివరి అస్ర్తాన్ని అధికారులు ప్రయోగించి భయపెట్టారు. చేసేది లేక స్థలాలు తీసుకోవడానికి లబ్ధిదారుల్లో చాలామంది ముందుకొచ్చారు.


ఇక..తుళ్లూరు మండలంలో ఉగాదికి అందరికీ ఇళ్ల పథకంలో 1190 మంది లబ్ధిదారులను రెవెన్యు అధికారులు గుర్తించారు. ఇందులో నాన్‌ పూలింగ్‌ గ్రామాలైన వడ్డమాను, హరిశ్చంద్రపురం, పెదపరిమిలో స్థలాల అన్వేషణను అధికారులు చేపట్టారు. 113 కుటుంబాలకు హరిశ్చంద్రపురంలో కేటాయింపు చేశారు.  రాజధాని కోసం తామిచ్చిన భూములలో నివేశన స్థలాలు ఎలా ఇస్తారని రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దొండపాడులో నివేశన స్థలంపొందిన వారు మరలా లబ్థిదారుల జాబితాలో చేరినట్టు సమాచారం. తాడేపల్లి పట్టణ, మండల పరిధిలో నివేశన స్థలాల కోసం 19600 మంది దరఖాస్తు చేసుకోగా 11300 మందిని అధికారుల అర్హులుగా తేల్చారు.  పెనుమాక సమీపంలో లాండ్‌ పూలింగ్‌కు ఇచ్చిన భూములను సర్వే చేసి ఎంపిక చేసి, కలెక్టర్‌కు పంపించారు. అయితే ఉన్నట్టుండి అక్కడ కాదని..తాడేపల్లికి దూరంగా ఉన్న నవులూరు గ్రామ పరిధిలో స్థలాలు కేటాయించడం గందరగోళానికి దారితీసింది. 


‘ఉపాధి’ భూములు లాగేశారు

పేద దళితులు, చర్మకార వృత్తిదారులకు ఉపాధిని కల్పించే లిడ్‌క్యాప్‌ యూనిట్‌ను కృష్ణాజిల్లా వెల్లటూరు గ్రామంలో నెలకొల్పడానికి 18 ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించారు. 2002లో ఈ యూనిట్‌కు శంకుస్థాపన జరిగింది. లిడ్‌క్యాప్‌ ద్వారా రెండు వేల మందికి పైగా ఉపాధిని కల్పించే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ యూనిట్‌కు కేటాయించిన భూములపై రెవెన్యూ యంత్రాంగం కన్ను పడింది. వాటిలో ఇళ్లస్థలాల కోసం లే అవుట్‌ పనులు ప్రారంభించారు.


భూముల వేట.. నిరసన మంట

సిద్ధేశ్వరుడిపై గునపం!

పేదల స్థలాల పేరిట కొండ చదును

అక్కడ తీస్తున్న మట్టిపై మహాదందా

ఇచ్చే స్థలాల్లో పోయాల్సిన ఎర్ర మట్టి

‘వైసీపీ’ కాంట్రాక్టర్ల సైట్లకు తరలింపు 

తిరుపతి, ఫిబ్రవరి 20(ఆంధ్రజ్యోతి): ఓ కొండ కొమ్మున క్రైస్తవులు కొలిచే శిలువ.. మరో కొండపై శివాలయం.. ఇంకో కొండపై శక్తి గుడి.. 3 శిఖరాలతో కిలోమీటర్ల కొద్దీ వ్యాపించిన సిద్ధేశ్వరుడి కొండలవి! అయితే, పచ్చదనాన్ని పులుముకొన్న ఈ కొండలూ, వాటి పాదాల చెంత కుంట్రపాకం ఎగువ చెరు వు గలగలలూ ఇప్పుడిక గతమే! ఉగాదికి పేదలకు ఇళ్లస్థలాలిచ్చే ముసుగులో అధికార యంత్రాంగం సాయంతో అధికార నేతలు చిత్తూరు జిల్లా తిరుపతి సమీపాన ఉన్న సిద్ధేశ్వరుడి కొండను తొలిచేస్తుంటే.. అక్కడ నుంచి మట్టిని అధికార నేతల దన్ను ఉన్న కాంట్రాక్టర్లు యథేచ్ఛగా తరలించుకుపోతున్నారు.


ఇక్కడ బయటపడే ఎర్రమట్టి నాణ్యమైంది. ఈ మట్టిని తు మ్మలగుంట ఫ్లైఓవర్‌ నిర్మాణపనులు జరుగుతున్న ప్రాంతాని కి టిప్పర్లు మోసుకుపోతున్నాయి. రెవెన్యూ అధికారులు మా త్రం ఈ మట్టిని పేదలకు ఇచ్చే స్థలాలను చదును చేయడాని కి వాడుతున్నామని చెబుతున్నారు. వీరి స్థలాల వేటతో ఇప్పటికే రెండు కొండలు సగంవరకూ కరిగిపోయాయి. పచ్చటి చె ట్లు, పొదలు, గండ్లూ కళను పోగొట్టుకుంటున్నాయి. మరి కొద్దిరోజులు గడిస్తే కొండలే కనిపించకుండాపోయే ప్రమాదం కనిపిస్తోంది. పేదలకు భూములివ్వాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉంటే.. తిరుపతి శివార్లలో ప్రభుత్వ స్థలాలు అందుబాటులో ఉన్నాయి. అయితే, అవన్నీ బడా నేతల ఆక్రమణలో ఉన్నా యి. వాటిలో ప్లాట్లు వేసి పేదలకు పంచొచ్చు. కానీ, వాటిని వదిలిపెట్టి సిద్ధేశ్వరుడి కొండను కుళ్లగిస్తున్నారు. ఈ కొండ అటవీ శాఖ పరిధిలో లేదు.


రెవిన్యూ గుట్ట పొరంబోకు కేటగి రీ కింద రికార్డుల్లో ఉంది. దీంతో రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగారు. ఈ కొండను సాధ్యమైనంతమేరా తవ్వి చదునుచేసి.. అక్కడ పేదలకు ఇళ్ళ స్థలాలు ఇవ్వచ్చునని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనకు అంగీకరించిన అధికార నేతలు ఎర్రమట్టి దందాకు తెరతీశారు. దీంతో పక్షంరోజులుగా ఈ అందమైన ప్రాంతం పొక్లెయిన్లు, ట్రిప్పర్ల అలజడి, రణగొణధ్వనులతో భీతావహంగా మారింది. అధికారులకు తెలిసే కొందరు కాంట్రాక్టర్లు పొక్లెయిన్లు, టిప్పర్లు ఏర్పాటు చేసుకున్నారని, వాటితో ఎర్రమట్టిని తవ్వి, తాము పనులు చేస్తున్న ప్రైవేటు ప్రాంతాలకు తరలించుకుపోతున్నారని రెవెన్యూ ఉద్యోగి ఒకరు చెప్పారు. దీనివెనుక అధికార పార్టీ ముఖ్యనేత సోదరుడున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 


పేదల భూములపైనే ప్రతాపం

ససేమిరా అన్నా.. బలవంతంగా సేకరణ

సాగులోని తోటలనూ నరికేసి స్వాధీనం 

పలుకుబడి ఉన్నోళ్ల భూముల జోలికి నో

విశాఖ జిల్లాలో భూసమీకరణ తీరు ఇదీ

విశాఖపట్నం, ఫిబ్రవరి 20(ఆంధ్రజ్యోతి): పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కోసం ప్రభుత్వం చేపట్టిన భూ సమీకరణ, భూసేకరణను విశాఖ జిల్లాలో రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తాతముత్తాల నుంచి సాగు చేసుకుంటున్న భూములను బలవంతంగా తీసుకోవడంపై మండిపడుతున్నారు.  విశాఖ నగర పరిసరాల్లో 6,116 ఎకరాలు, గ్రామీణ ప్రాంతంలో 1600 ఎకరాలు సేకరించాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. జిరాయితీ, అసైన్డ్‌ భూములకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇస్తామని చెబుతున్న అధికారులు, ప్రభుత్వ భూముల్లో ఏళ్ల తరబడి సాగుదారులుగా ఉన్న వారికి ఎటువంటి హామీ ఇవ్వకుండా బలవంతంగా స్వాధీనం చేసుకుంటున్నారు.


ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూముల స్వాధీనం విషయంలో పలుకుబడి కలిగిన కుటుంబాలను కాదని, పేదోళ్లపై మాత్రమే ప్రతాపం చూపిస్తున్నారు. అసైన్డ్‌ భూముల విషయంలో నోటిమాటగా చెబుతున్నారు తప్ప రాతపూర్వకంగా ఎటువంటి హామీ ఇవ్వడం లేదు. బుచ్చెయ్యపేట మండలం అయితంపూడికి చెందిన అయితంపూడి దేవుళ్లు, గోవింద్‌ తదితరులు ప్రభుత్వ భూమిని నాలుగు దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్నారు. ఆ భూముల్లోని సరుగుడు తోటలను కొ ట్టేసి భూమిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఖాళీగా ప్రభుత్వ భూములు చాలా ఉన్నా, తాము సాగు చే స్తున్న భూమిని బలవంతంగా తీసుకున్నారని వీరు వాపోతున్నారు. కాగా భూసమీకరణపై గ్రామ సభల్లో గొడవలు జరిగాయి. అభివృద్ధి చేసిన లేఅవుట్‌లలో అసైన్డ్‌ పట్టా కలిగిన రైతుకు ఎకరాకు 900 గజాలు, పదేళ్లకుపైగా ప్రభుత్వ భూ మిలో ఉన్నవారికి 450 గజాలు, పదేళ్ల లోపు అయితే 250 గజాలు ఇస్తామని అధికారులు ప్రకటించారు. అయినా త మ భూములు ఇచ్చేది లేదని రైతులు తేల్చిచెప్పారు. అధికారులు మాత్రం బలవంతంగా స్వాధీనం చేసుకుంటున్నారు. 


పాఠశాల భూమినీ వదలట్లేదు!

పేదల అసైన్డ్‌ భూములకు ఎసరు.. కొండ గుట్టల్లో లే అవుట్లు

చిత్తూరులో స్థలాల ఎంపిక అస్తవ్యస్తం

తిరుపతి, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): చిత్తూరు జిల్లాలో ఇళ్ల స్థలాల కోసం భూమి సేకరణ అస్తవ్యస్తంగా తయారైంది. జిల్లాలో 1.07 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలివ్వడానికి 2291 ఎకరాల భూమి కావాల్సి ఉండగా ఇప్పటి వరకూ 1927 ఎకరాలు గుర్తించారు. వాటిలో పాఠశాల స్థలాలు, నీటి కుంట లు, కొండ గుట్టలు, అటవీ భూములూ ఉన్నాయి. పుంగనూరు మండలం చదళ్ల గ్రామంలో పేదలకు ఇళ్ల పట్టాలిచ్చేందుకు రెవెన్యూ అధికారులు ఆ గ్రామ సర్వే నంబరు 273-5లో మొ త్తం 2.42 ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించారు. కానీ.. ప్రజ లు ఎదురు తిరిగడంతో గ్రామంలోని నీటి ఆధారమైన చదళ్ల కుంటకు ఎసరు పెట్టారు. గుర్రంకొండ మండల కేంద్రంలో 315 మందికి ఐదెకరాల భూమిని గుర్తించారు. ఇందులో ఆదె మ్మ, శ్రీనివాసులు అనే రైతుల కుటుంబాలు 40 ఏళ్లుగా పం టలు సాగు చేసుకుంటున్నాయి. వారికి సమాచారం ఇవ్వకుండానే అధికారులు ఆ భూమిని చదును చేసేశారు. దీంతో వా రు హైకోర్టు తలుపుతట్టారు. వాల్మీకిపురం మండలం టేకలకోనలో ఎస్సీ సామాజికవర్గానికి చెందిన నిరుపేద వెంకట్రమణ కుటుంబానికి రెండున్నర ఎకరాల భూమి వుంది.


1956లో ప్ర భుత్వం అతని తాత కొండప్ప పేరిట పట్టా ఇచ్చింది. ఇప్పుడు వారికి నోటీసులు కూడా ఇవ్వకుండానే భూమిని చదును చేస్తున్నారు. బాధిత కుటుంబం కాళ్లావేళ్లా పడుతున్నా వినడం లేదు. పూతలపట్టు మండలం ఎగువ పాలకూరు జడ్పీ హైస్కూలు ఆట స్థలాన్ని రెవెన్యూ అధికారులు ఇల్ల స్థలాలకు ఎంపిక చేశారు. వి.కోట మండలం బోయ చిన్నాగనపల్లె పంచాయతీ లింగాపురం జడ్పీ హైస్కూలు ఆటస్థలంలో ఇళ్ల స్థలాలకు లే అవుట్‌ వేశారు. పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభ్యంతరం చెబుతున్నా రెవెన్యూ అధికారులు వినడం లేదు. తిరుపతి అర్బన్‌లోని మంగళం వద్ద 50 ఎకరాల అటవీ భూమిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అటవీ అధికారుల అభ్యంతరాలను ఖాతరు చేయడంలేదు. తిరుపతి రూరల్‌ మండలం కుంట్రపాకం పంచాయతీ పరిధిలోని సిద్ధేశ్వర కొండను కనుమరుగు చేసేస్తున్నారు. 


అసైన్డ్‌ భూములే టార్గెట్‌!

పరిశ్రమలకు కేటాయించిన భూమీ వెనక్కు.. ‘తూర్పు’లో భూములు లాక్కొంటున్న ప్రభుత్వం

కాకినాడ, ఫిబ్రవరి 20(ఆంధ్రజ్యోతి): తూర్పుగోదావరి జిల్లాలో ఇళ్ల స్థలాల సాకుతో పేదలకిచ్చిన అసైన్డ్‌ భూముల దగ్గర నుంచి పరిశ్రమలకు కేటాయించిన స్థలాల వరకూ ప్రభుత్వం లాగేసుకుంటోంది. అవీ చాలక చెరువులను కూడా పూడ్చేస్తోంది. ప్రభుత్వ నర్సరీలు, ఆయిల్‌ పాం తోటలు, విశ్వవిద్యాలయాలకు కేటాయించిన భూములు ఇలా వేటినీ వదలడం లేదు. జిల్లాలో ఇంటి స్థలం లేని పేదలు పట్టణాల్లో 1,05,460, గ్రామాల్లో 2,07,853 మంది అర్హులుగా ఉన్నారు. వారందరికీ ఇల్లస్థలాలు ఇవ్వాలంటే 4,794 ఎకరాలు కావాలి. కానీ 1,390 ఎకరాల ప్రభుత్వ భూమి మాత్రమే అందుబాటులో ఉంది. దీంతో 3,404 ఎకరాల ప్రైవేటు భూముల అవసరం ఏర్పడింది. దీనికోసం ప్రభుత్వం అసైన్డ్‌ భూములు లాగేసుకుంటోంది.


చేబ్రోలులో దళితులకు ఇచ్చిన భూములు తీసుకోవడానికి అధికారులు నోటీసులు ఇవ్వడంతో ఇటీవల బాలరాజు అనే అసైన్డ్‌ రైతు గుండెపోటుతో మరణించారు. వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన 115 ఎకరాలను కూడా అధికారులు తీసేసుకుంటున్నారు. నిర్మాణాలకు పనికి రావని ఇంజనీర్లు మొత్తుకుంటున్నా కాకినాడకు సమీపంలో 816 ఎకరాల ఉప్పు భూములను కూడా తీసుకోవడానికి నిర్ణయించారు. 110 ఎకరాల కాకినాడ పోర్టు భూములు కూడా లాగేసుకున్నారు. నన్నయ విశ్వవిద్యాలయం భూములు కూడా వదిలిపెట్టడం లేదు.


పసుపు-కుంకుమ భూమినీ వదల్లేదు 

రైతుకు సమాచారం లేకుండానే నోటిఫికేషన్‌

ప్రతిఘటిస్తున్నా వెనక్కి తగ్గని అధికారులు

పుంతలనూ లేఅవుట్‌లుగా మార్చేస్తున్నారు

పశ్చిమగోదావరిలో భూసేకరణ తీరు ఇదీ

ఏలూరు ఫిబ్రవరి 20(ఆంధ్రజ్యోతి): ఇంటి ఆడపడుచులకు పసుపు-కుంకుమ కింద ఇచ్చిన భూమినీ వదిలిపెట్టలేదు. దశాబ్దాల క్రితం ప్రభుత్వం కేటాయించిన భూముల ను వెనక్కి తీసుకుంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో భూమి లభ్యత తక్కువగా ఉండటంతో నయానోభయానో భూమిని స్వాధీనం చేసుకుని, తిరిగి కొత్త వారికి పట్టాలు ఇ చ్చేందుకు అధికారులు అత్యుత్సాహం చూపిస్తున్నారు. జి ల్లాలో 1.57 లక్షల మందికి పట్టాలు ఇచ్చేందుకు 3,250 ఎకరాలు అవసరమని నిర్ణయించారు. ఆ దిశగా పుంతలను కూడా లేఅవుట్‌లుగా మార్చేస్తున్నారు. రైతులు గగ్గోలు పె డుతున్నా పట్టించుకోవట్లేదు. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామానికి చెందిన రామాయమ్మ, మంగ, దుర్గలకు 40 ఏళ్ల క్రితం తల్లిదండ్రులు పసుపు-కుంకుమగా 70 సెంట్ల చొప్పున భూమి ఇచ్చారు. దీంతో వీరు ఉమ్మడిగా పా మాయిల్‌ సాగు చేస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నా రు. ఇదంతా పట్టా భూమి. అయినా రెవెన్యూ అధికారులు పామాయిల్‌ను తొలగించి లేఅవుట్‌లకు యత్నించారు. ఈ కుటుంబాలన్నీ పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించడంతో అధికారులు కాస్త వెనక్కి తగ్గా రు. అయినా, ఏక్షణంలోనైనా స్వాధీనం చేసుకుంటారనే భ యం వీరిలో నెలకొంది. ఇదే గ్రామంలో 1953లో తాతముత్తాతలు ఇచ్చిన భూములకు ఇంతకుముందే ప్రభుత్వం పాస్‌బుక్‌లు జారీ చేసింది. రైతు భరోసా ద్వారా పలువురికి లబ్ధి కూడా చేకూరింది.


ఆకుల వెంకటరమణమ్మ, కొంపల్లి వెంకటరమణమ్మలకు బ్యాంకులు రెండు లక్షలకు పై గా రుణాలు కూడా ఇచ్చాయి. వీరి భూ మినీ స్వాధీనం చేసుకునేందుకు రెవె న్యూ యంత్రాంగా ప్రయత్నిస్తుండటం తో వీరు కొద్దిరోజులుగా ప్రతిఘటిస్తూనే ఉన్నారు. తణుకు సమీప పైడిపర్రులో దాదాపు 50 ఎకరాల పట్టాభూమి 14 మంది రైతుల పేరిట ఉంది. వీరికి  సమాచారం లేకుండానే భూమిని సేకరిస్తున్నట్లు పత్రికల్లో ప్రకటించారు. దీం తో తమ  అనుమతి లేకుండా ఎలా నోటిఫికేషన్‌ ఇస్తారం టూ రైతులు నిలదీశారు. ప్రస్తుతం ఇక్కడ ఎకరం ధర రూ.70 లక్షలు ఉంది. కానీ, ఎకరాకు రూ.56 లక్షలు పరిహారానికి ఒప్పుకోవాలంటూ ఒత్తిడి పెంచారు. ఇలా దాదాపు 14 మండలాల్లో రెవెన్యూ యంత్రాంగం మొండిగా వ్యవహరించింది. కొన్నిచోట్ల పుంతలను స్వాధీన పరుచుకొన్నారు. 

Updated Date - 2020-02-21T09:14:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising