ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హరిప్రసాద్ ఒక డ్రగ్ ఎడిక్ట్..: గౌరీ శంకర్

ABN, First Publish Date - 2020-09-18T22:00:19+05:30

అమరావతి: ఫైబర్ నెట్టుని అడ్డం పెట్టుకుని వేమూరి హరి ప్రసాద్ భారీ ఎత్తున దోపిడీకి పాల్పడ్డారని ఫైబర్ నెట్ మాజీ ఈడీ గౌరీ శంకర్ ఆరోపించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఫైబర్ నెట్టుని అడ్డం పెట్టుకుని వేమూరి హరి ప్రసాద్ భారీ ఎత్తున దోపిడీకి పాల్పడ్డారని ఫైబర్ నెట్ మాజీ ఈడీ గౌరీ శంకర్ ఆరోపించారు. ఫైబర్ నెట్ స్కామ్ విషయంలో హరి ప్రసాద్ చేసిన అక్రమాలపై తన దగ్గర సాక్ష్యాలున్నాయన్నారు. ఏపీ ఎస్ఎఫ్ఎల్ సంస్థని తన సొంత ప్రైవేట్ కంపెనీగా నడిపించారని ఆరోపించారు. ఏపీ ఫైబర్ నెట్‌లో ఇంకా హరి ప్రసాద్ మనుషులే ఉన్నారన్నారు. ఫైబర్ నెట్ బిల్లింగ్ కూడా సరిగా జరగలేదన్నారు. ఫైబర్ నెట్ బిల్లింగ్ సాఫ్ట్ వేర్‌లో అవకతవకల కారణంగా కోట్లాది రూపాయల మేర నష్టం వాటిల్లిందని గౌరీ శంకర్ తెలిపారు. నాలుగేళ్ల పాటు ఇలాగే తప్పుడు బిల్లింగ్ జరిగిందన్నారు. హరి ప్రసాద్ కారణంగా ఫైబర్ నెట్ కార్పొరేషన్‌లో సుమారు రూ. 800 కోట్ల మేర అవినీతి జరిగి ఉంటుందన్నారు. హరి ప్రసాద్ డ్రగ్ ఎడిక్ట్ అని... ఒక్క రూపాయి జీతం తీసుకుని ఏపీ ప్రభుత్వం కోసం పని చేశానని హరి ప్రసాద్ చెప్పుకున్నారని.. కోకాపేటలో రూ.10 కోట్ల విలువైన బిల్డింగ్ ఎలా కట్టగలిగారని ప్రశ్నించారు. హరి ప్రసాద్ అంశంపై సీబీఐ ఎంక్వైరీ చేయాలని గౌరీ శంకర్ తెలిపారు.

Updated Date - 2020-09-18T22:00:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising