ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గవర్నర్‌తో సీఎం భేటీ

ABN, First Publish Date - 2020-03-31T09:26:46+05:30

గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌తో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సమావేశమయ్యారు. సోమవారమిక్కడ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కరోనా వైరస్‌ నివారణపై జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీలతో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • కరోనా కట్టడి చర్యలపై వివరణ
  • 15 రోజుల్లో రెండో సారి భేటీ


అమరావతి, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌తో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సమావేశమయ్యారు. సోమవారమిక్కడ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కరోనా వైరస్‌ నివారణపై జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అనంతరం విజయవాడలోని రాజ్‌భవన్‌కు గవర్నర్‌ను కలిశారు. రాష్ట్రంలో అమలులో ఉన్న లాక్‌డౌన్‌.. జిల్లాల వారీగా నియంత్రణలో ఉన్న కరోనా వైరస్‌ కేసులు.. విదేశాల నుంచి వచ్చినవారి సంఖ్య, వారిపై నిఘా తదితర అంశాలను ఆయనకు వివరించారు. కాగా.. గవర్నర్‌ను ముఖ్యమంత్రి ఈ నెలలో కలవడం ఇది రెండోసారి. కరోనా వైరస్‌ ఉధృతి నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసినందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌పై ఆగ్రహించిన ఆయన.. ఈ నెల 15వ తేదీన విశ్వభూషణ్‌ను కలిసి ఫిర్యాదుచేసిన సంగతి తెలిసిందే. కరోనా తీవ్రత లేదని, స్థానిక ఎన్నికలు జరపవచ్చునని గవర్నర్‌కు చెప్పిన 15 రోజుల్లోనే కరోనా కట్టడికి తీవ్రతకు తీసుకున్న చర్యలను వివరించడానికి మళ్లీ రాజ్‌భవన్‌కు వెళ్లడం కొసమెరుపు.

Updated Date - 2020-03-31T09:26:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising