ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనాను మించిన దారుణ ప్రమాదం ఇదే..!

ABN, First Publish Date - 2020-04-02T23:17:46+05:30

ప్రభుత్వ ఆస్పత్రులు కోవిడ్ సెంటర్లుగా మార్చడంతో సాధారణ అత్యవసర వైద్య సేవలు నిలిచిపోయాయి. ప్రధానంగా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు: ప్రభుత్వ ఆస్పత్రులు కోవిడ్ సెంటర్లుగా మార్చడంతో సాధారణ అత్యవసర వైద్య సేవలు నిలిచిపోయాయి. ప్రధానంగా డయాలసిస్ రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నెల్లూరు వంటి ప్రాంతాల్లో డయాలసిస్ నిలిపివేయడంతో రోగులు ఆందోళన చెందుతున్నారు. ఒక్కసారి డయాలసిస్ జరగకున్నా ప్రాణాలకే ముప్పు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు డయాలసిస్ రోగుల పరిస్థితి దయనీయంగా ఉంది. 


నెల్లూరు ప్రభుత్వాస్పత్రిలోని డయాలసిస్ విభాగంలో ప్రతి రోజూ 60 మందికి డయాలసిస్ జరుగుతూనే ఉంటుంది. వారంలో రోజుల్లో సుమారు 300 మందికి పైగా రోగులు డయాలసిస్ చేయించుకుంటూ ఉంటారు. ఒక్కో రోగి వారంలో మూడుసార్లు డయాలసిస్ చేయించే పరిస్థితులు ఉన్నాయి. కరోనా కారణంగా ఆస్పత్రిలోని కోవిడ్ రీజియన్ సెంటర్‌గా మార్చేశారు. సాధారణ అత్యవసర వైద్య సేవలను నిలిపివేశారు. దాంతో డయాలసిస్ విభాగం కూడా ఆగిపోయింది. జిల్లాలోని సుదూర ప్రాంతాంలకు చెందిన పేద నిరుపేద రోగులే వస్తూ ఉంటారు. ప్రస్తుతం వాహనాలు లేకపోవడంతో ఆఖరికి రూ.1500ల నుంచి రూ.3000 బాడుగ చెల్లించి నెల్లూరుకు చేరుకుంటున్నారు. 


Updated Date - 2020-04-02T23:17:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising