ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

14 వర్సిటీలకు ఈసీల పునర్వ్యవస్థీకరణ

ABN, First Publish Date - 2020-03-24T10:00:00+05:30

రాష్ట్రంలోని 14 యూనివర్సిటీలకు పాలక మండళ్ల(ఈసీ)ను రాష్ట్ర ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. శ్రీపద్మావతి మహిళా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, మార్చి 23(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని 14 యూనివర్సిటీలకు పాలక మండళ్ల(ఈసీ)ను రాష్ట్ర ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం(తిరుపతి), శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం(తిరుపతి), ద్రవిడ వర్సిటీ (కుప్పం), జేఎన్‌టీయూ కాకికాడ, జేఎన్‌టీయూ అనంతపురం, యోగి వేమన(కడప), విక్రమ సింహపురి(నెల్లూరు), శ్రీకృష్ణదేవరాయ(అనంతపురం), డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ వర్సిటీ(శ్రీకాకుళం), రాయలసీమ వర్సిటీ(కర్నూలు), కృష్ణా విశ్వవిద్యాలయం(మచిలీపట్నం), ఆంధ్రా యూనివర్సిటీ (విశాఖపట్నం), ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం(గుంటూరు), ఆదికవి నన్నయ యూనివర్సిటీ(రాజమహేంద్రవరం)లకు కొత్త పాలక మండళ్లను నియమిస్తూ ఉన్నత విద్యాశాఖ స్పెషల్‌ సీఎస్‌ సతీశ్‌చంద్ర సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పాలకమండళ్ల పదవీకాలం మూడేళ్లు. పాలకమండలిలో 14 మంది సభ్యులుంటారు. 


వీసీల కోసం సెర్చ్‌ కమిటీలు

రాష్ట్రంలోని 4 విశ్వవిద్యాలయాలలో ఖాళీగా ఉన్న వైస్‌ చాన్సెలర్‌(వీసీ) పోస్టుల భర్తీకి ప్రభుత్వం సెర్చ్‌ కమిటీలను నియమించింది. ఆంధ్రా విశ్వవిద్యాలయం, శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం, రాయలసీమ విశ్వవిద్యాలయాలకు వీసీలను నియమించాల్సి ఉంది. 

Updated Date - 2020-03-24T10:00:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising