ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

'ఏపీ బొమ్మల తయారీ బోర్డు' ఏర్పాటుకు గౌతమ్‌ రెడ్డి ఆదేశం

ABN, First Publish Date - 2020-10-21T21:33:26+05:30

పరిశ్రమలశాఖపై మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సమావేశంలో పరిశ్రమలశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈడీబీ, పరిశ్రమల నీటి అవసరాలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: పరిశ్రమలశాఖపై మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సమావేశంలో పరిశ్రమలశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈడీబీ, పరిశ్రమల నీటి అవసరాలు, ఎస్ఐపీసీ, ఎస్ఐపీబీపై చర్చించారు. పరిశ్రమల శాఖకు సంబంధించిన ప్రత్యేక వెబ్ సైట్ 'స్పందన' ప్రారంభించారు. పరిశ్రమలకు సంబంధించి 'గ్రీవెన్స్' స్వీకరించేలా రూపకల్పన చేశారు. విశాఖ, గోదావరి జిల్లాలలో బొమ్మల తయారీ పరిశ్రమలకు పెద్దపీట వేయాలని మంత్రి ఆదేశించారు. 'ఏపీ బొమ్మల తయారీ బోర్డు' ఏర్పాటు చేయాలని మంత్రి గౌతమ్‌ రెడ్డి ఆదేశించారు. నవంబర్‌లో 'ఇండస్ట్రీస్ స్పందన' ప్రారంభిస్తామని గౌతమ్‌ రెడ్డి తెలిపారు. బొమ్మల తయారి ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వానికి ఆదాయంలో పాటు కార్మికులకు జీవనోపాధి కూడా లభిస్తుందని అధికారులు చెబుతున్నారు. కృష్ణాజిల్లాలోని కొండపల్లి బొమ్మలకు దేశవ్యాప్తంగా మంచి గిరాకీ ఉంది. ఈ బొమ్మలు కళాత్మకమైన పనితనానికి ప్రాచుర్యం పొందాయి. సంప్రదాయకరమైన కొండపల్లి శైలిలోని తాడిచెట్టు బొమ్మలు, ఎడ్లబండి బొమ్మలు, అబారీ ఏనుగు బొమ్మలు, గ్రామ నేపథ్యంలోని బొమ్మలు కొండపల్లిలో తయారు చేస్తుంటారు.

Updated Date - 2020-10-21T21:33:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising