ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏబీఎన్‌ ప్రతినిధిపై దాడిని ఖండించిన గోరంట్ల బుచ్చయ్య

ABN, First Publish Date - 2020-06-16T18:39:27+05:30

ఏబీఎన్‌ ప్రతినిధిపై దాడిని ఖండించిన గోరంట్ల బుచ్చయ్య

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ మీడియా సమావేశంలో ఏబీఎన్ ప్రతినిధిపై జరిగిన దాడిని ఖండించిన టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్రంగా ఖండించారు. వ్యవస్థలన్నింటిపై దాడి చేయడం ఈ ప్రభుత్వానికి అటవాటే అని మండిపడ్డారు. మీడియా సమావేశానికి పిలిచి ప్రశ్నలు అడగకూడదనటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రశ్నలకు సమాధానం చెప్పలేనప్పుడు మీడియా సమావేశం పెట్టకూడదని..ప్రెస్ నోట్ పంపించాలని హితవు పలికారు. పార్టీల నాయకులపైన, కార్యకర్తలపైన, ఇప్పుడు మీడియాపైన ఈ ప్రభుత్వం దాడులు చేస్తోందని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.


16కీలక అంశాలపై బీఏసీలో టీడీపీ పట్టుబడుతుందని తెలిపారు. దానికి ఈ ప్రభుత్వం సమయం ఇవ్వదన్నారు. గవర్నర్ ద్వారా ఉభయ సభలనుద్దేశించి వర్చువల్‌ ప్రసంగం చేయించినప్పుడు వర్చువల్‌ అసెంబ్లీ ఎందుకు నిర్వహించకూడదని ప్రశ్నించారు. రెండు రోజుల పాటే అసెంబ్లీ నిర్వహించడం ద్వారా చాలా ప్రజా సమస్యలను చర్చించే అవకాశం లేకుండా పోతుందని గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. అసెంబ్లీకి పూర్తి స్థాయి పీపీఈ కిట్‌తో హాజరైన బుచ్చయ్య దానిపై మాట్లాడుతూ తనకు కోవిడ్ వైరస్ రాకూడదని, తన ద్వారా ఇంకొకరికి వ్యాపించకూడదని ఈ జాగ్రత్తలు తీసుకున్నానని తెలిపారు. 

Updated Date - 2020-06-16T18:39:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising