ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్యాస్‌ బాధితులకు రూ.30కోట్లు

ABN, First Publish Date - 2020-05-09T09:47:40+05:30

విశాఖలో గ్యాస్‌ లీకేజీ బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్‌) నుంచి రూ.30కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీఎంఆర్‌ఎఫ్‌ నుంచి విడుదల


అమరావతి, మే 8 (ఆంధ్రజ్యోతి): విశాఖలో గ్యాస్‌ లీకేజీ  బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్‌) నుంచి  రూ.30కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ  చేసింది. విశాఖ జిల్లా కలెక్టర్‌ పేరిట ఈ నిధులను శుక్రవారం విడుదల చేసినట్లు రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి వి.ఉషారాణి ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.


‘విశాఖ’ ఘటనలో వందల మంది తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ముఖ్యమంత్రి గురువారం విశాఖకు వెళ్లి బాధితులను పరామర్శించిన సందర్భంగా.. మృతుల కుటుంబాలు, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నవారిని ఆదుకుంటామని అక్కడికక్కడే వారికి ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఈ నేపథ్యంలో సీఎంఆర్‌ఎఫ్‌ నుంచి బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లిస్తూ ఆదేశాలు ఇచ్చారు. బాధితులను  తక్షణమే గుర్తించి పరిహారం అందించాలని, అనంతరం వారి వివరాలను ప్రభుత్వానికి పంపించాలని విశాఖ కలెక్టర్‌ను ఆ ఉత్తర్వుల్లో రెవెన్యూశాఖ ఆదేశించింది. 

Updated Date - 2020-05-09T09:47:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising