విజయవాడ: గండికోట సీతయ్య ఔదార్యం
ABN, First Publish Date - 2020-03-27T18:21:46+05:30
కరోనా ప్రభావంతో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతోంది.
విజయవాడ: కరోనా ప్రభావంతో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతోంది. పలు చోట్ల పేదలను కొంతమంది దాతలు ఆదుకుంటున్నారు. విజయవాడ సమీపంలోని అంబాపురంలో గండికోట సీతయ్య గ్రామంలోని 15వందల మందికి నిత్యావసర సరకులు అందజేస్తున్నారు. ఈ సందర్బంగా ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ గత ఐదారుఏళ్లుగా ఈ గ్రామంలో పేదలకు తనకు తోచిన విధంగా సహాయం చేస్తున్నానని చెప్పారు. ఇప్పుడు కరోనా వైరస్ నేపథ్యంలో తన గ్రామంలో ఉన్నవారంతా పేద ప్రజలని, ఇప్పుడు వారు పనులు లేక ఇబ్బందుపడుతున్నారని అన్నారు. అందుకే తాను 20 కేజీల బియ్యం, 5 కేజీల కూరగాయలు అందజేస్తున్నట్లు గండికోట సీతయ్య చెప్పారు.
Updated Date - 2020-03-27T18:21:46+05:30 IST