కడప జిల్లా: భారీ వర్షాలు.. ఇళ్లల్లోకి పాములు
ABN, First Publish Date - 2020-09-14T19:16:39+05:30
గండికోట ప్రాజెక్టు ముంపు ప్రాంతాల్లో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
కడప జిల్లా: గండికోట ప్రాజెక్టు ముంపు ప్రాంతాల్లో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నివాసాల్లోకి నీరు చేరడంతో ముంపు వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు గండికోట ప్రాజెక్టులో నీరు భారీగా వచ్చి చేరుతోంది. ఇప్పటికే 12 టీఎంసీలకు పైగా నీరు చేరడంతో ముంపు గ్రామాల్లో మురుగు నీరు ఇళ్లల్లోకి చేరింది. పాములు, తేళ్లు, విషపురుగులు నివాసాల్లోకి వస్తున్నాయి. దీంతో జనం ఆందోళన చెందుతున్నారు. అయితే బ్యాక్ వాటర్ పెరగకుండా గండికోట నుంచి ఇతర ప్రాజెక్టులకు, అక్కడి నుంచి పెన్నానది దిగువకు నీరు వదులుతున్నామని అధికారులు తెలిపారు. ముంపు ప్రాంతాల్లో ఇళ్లను ఖాళీ చేయాలని అధికారులు సూచించారు.
Updated Date - 2020-09-14T19:16:39+05:30 IST