ఫోర్జరీ సంతకాలతో పోటీ నుంచి తప్పించారు
ABN, First Publish Date - 2020-03-16T09:41:14+05:30
సంతకాలు ఫోర్జరీ చేసి ఎన్నికల్లో పోటీ నుంచి తమను తప్పించారని టీడీపీ మండల నాయకులు, ఎంపీటీసీ అభ్యర్థులు పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు ఫిర్యాదుచేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయనను కలిసి మండలంలో
- చంద్రబాబుకు టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థుల ఫిర్యాదు
ముప్పాళ్ళ, మార్చి 15: సంతకాలు ఫోర్జరీ చేసి ఎన్నికల్లో పోటీ నుంచి తమను తప్పించారని టీడీపీ మండల నాయకులు, ఎంపీటీసీ అభ్యర్థులు పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు ఫిర్యాదుచేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయనను కలిసి మండలంలో 12 ఎంపీటీసీలకు గానూ 5 ఎంపీటీసీను వైసీపీ ఏకగ్రీవంగా ఎన్నిక చేయించుకుందని తెలిపారు. గోళ్లపాడు, లంకెలకూరపాడు, రుద్రవరం గ్రామాల ఎంపీటీసీల సంతకాలను వైసీపీ వర్గీయులు ఫోర్జరీ చేసి విత్‌డ్రాలు చేయించారని ఆవేదన వ్యక్తంచేశారు. మాదలలో ఉన్న రెండు ఎంపీటీసీల బీ-ఫారాలను చించివేసి బలవంతంగా, దౌర్జన్యంగా విత్‌డ్రా ఫారాలపై సంతకాలు చేయించారని వారు చంద్రబాబుకు చెప్పారు.
Updated Date - 2020-03-16T09:41:14+05:30 IST