ఐదు మృతదేహాలు కేజీహెచ్‌లోనే!
ABN, First Publish Date - 2020-05-09T10:26:29+05:30
ఎల్జీ పాలిమర్స్ నుంచి వెలువడిన విషవాయువు పీల్చి 11 మంది మరణించగా, వారిలో కొందరి మృతదేహాలను తీసుకువెళ్లడానికి ఎవ రూ ముందుకు రావడం లేదు.
విశాఖపట్నం, మే 8 (ఆంధ్రజ్యోతి): ఎల్జీ పాలిమర్స్ నుంచి వెలువడిన విషవాయువు పీల్చి 11 మంది మరణించగా, వారిలో కొందరి మృతదేహాలను తీసుకువెళ్లడానికి ఎవ రూ ముందుకు రావడం లేదు. విషవాయువు పీల్చి కొంతమంది, ఊపిరి అందక పరుగు తీస్తూ ఇంకొందరు, కొందరు కాలువలో పడి, ఒకరు నేల బావిలో పడి మరణించిన సంగ తి తెలిసిందే. వీరి మృతదేహాలకు కేజీహెచ్‌లో శుక్రవారం పోస్టుమార్టం నిర్వహించారు. అయితే కేవలం ఆరు మృతదేహాలను మాత్రమే వారి బంధువులు సాయంత్రం వచ్చి తీసుకువెళ్లారు. మిగిలినవి మార్చురీ దగ్గరే రాత్రి 10 గంటల వర కు ఉన్నాయి. పోస్టుమార్టం చేయక ముందైతే మృతదేహాల ను ఫ్రీజర్‌లో ఉంచి భద్రపరుస్తారు. అన్ని పరీక్షలు పూర్తయ్యాక మాత్రం వాటిని అలా ఉంచడానికి ఉండదు.
పోలీసులకు సమాచారం అందించి, దహన సంస్కారాలకు తగిన చర్యలు తీసుకుంటారు. ఈ ఐదు మృతదేహాల విషయం పోలీసుల దృష్టికి తీసుకెళుతున్నట్టు కేజీహెచ్ వర్గా లు తెలిపాయి. కాగా, చనిపోయినవారంతా పాలిమర్స్ కంపె నీ పరిసర గ్రామాలైన వెంకటాపురం, వెంకటాద్రి గార్డెన్స్‌కు చెందిన వారే. గ్యాస్ లీకేజీ తరువాత నిర్మానుష్యంగా మారిన ఆ గ్రామాల్లోకి ఎవరినీ అనుమతించడం లేదు. వాయువు ప్రభావం ఇంకా ఉందని, 24 గంటల తర్వాతే ఏ విషయమై నా చెప్పగలుగుతామని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మృతదేహాలను తీసుకువెళ్లినవారు వాటిని ఎక్కడ దహనం చేశారో తెలియడం లేదు.
Updated Date - 2020-05-09T10:26:29+05:30 IST