ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బ్రేకింగ్: ఏపీలో తొలి కరోనా మరణం

ABN, First Publish Date - 2020-04-03T19:20:26+05:30

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ఏపీలో కల్లోలం రేపుతోంది. ఏపీలో విజయవాడలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ఏపీలో కల్లోలం రేపుతోంది. ఏపీలోని విజయవాడలో తొలి కరోనా మరణం సంభవించింది. విజయవాడలో 55 ఏళ్ల వ్యక్తి మృతి చెందారు. మార్చి 17న ఢిల్లీ నుంచి వచ్చిన కుమారుడి ద్వారా ఆ వ్యక్తికి కరోనా సోకింది. వెంటనే తండ్రి, కుమారుడితో కాంటాక్ట్ అయిన 29 మందిని అధికారులు క్వారంటైన్‌కు తరలించారు. అయితే.. రాష్ట్రంలో తొలి కరోనా మరణం సంభవించడంతో జిల్లా ప్రజలు భయంతో వణికిపోతున్నారు. మరోవైపు ఆ వ్యక్తి నుంచి ఈ వైరస్ ఎంతమందికి సోకిందో అనే ఆందోళన జనాల్లో నెలకొంది. కాగా ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 


ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. శుక్రవారం నాటికి రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 161కి చేరుకుంది. ఇవాళ నెల్లూరు-8, విశాఖ-3, కడపలో ఒక పాజిటివ్‌ కేసు నమోదయ్యాయి. నిన్నటి వరకూ కృష్ణా జిల్లాలో ఎక్కువ కేసులు నమోదవ్వగా.. తాజాగా నెల్లూరు జిల్లాలో కరోనా డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. దీంతో జిల్లా ప్రజలు భయంతో వణికిపోతున్నారు.


Updated Date - 2020-04-03T19:20:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising