ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాణిక్యాల రావు చివరి ట్వీట్ ఇది..ఆయనకు కరోనా ఎలా సోకిందంటే..

ABN, First Publish Date - 2020-08-01T21:53:30+05:30

ఏపీ మాజీ మంత్రి మాణిక్యాలరావు(60) కరోనా సోకి, పరిస్థితి విషమించడంతో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: ఏపీ మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు(60) కరోనా సోకి, పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు. తాడేపల్లిగూడెం మాజీ మున్సిపల్ చైర్మన్, బీజేపీ నేత ఈతకోట తాతాజీకి(భీమ శంకరరావు) కరోనా సోకింది. ఆయనకు కరోనా సోకినట్టు గుర్తించక ముందు, మాజీ మంత్రి మాణిక్యాలరావు ఆయనతో కలిసి కారులో ప్రయాణించారు. తాతాజీకి కరోనా సోకినట్టు తెలిసి మాణిక్యాల రావు కూడా ముందు జాగ్రత్తగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.


కరోనా బారిన పడిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ త్వరగా కోలుకోవాలని జూలై 25న ట్వీట్ చేసిన మాణిక్యాలరావు తన ఆరోగ్య పరిస్థితిపై వదంతులు ఎవరు నమ్మవద్దని, కంగారు పడవద్దని, అధైర్య పడవద్దని ట్వీట్ చేశారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని చెప్పారు. భగవంతుని ఆశీస్సులతో, అందరి ఆదరాభిమానాలతో తాను పరిపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వస్తానని మాణిక్యాల రావు చివరిగా ట్వీట్ చేశారు. అంత ధైర్యంగా ఉన్న మాణిక్యాలరావు కరోనా వల్ల మరణించడంతో ఆయన అనుచరులు దిగ్భ్రాంతికి లోనయ్యారు.





Updated Date - 2020-08-01T21:53:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising