ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమరావతి కోసం రామాలయంలో రైతుల పూజలు

ABN, First Publish Date - 2020-08-05T20:59:14+05:30

దశాబ్ధాలపాటు హిందువులంతా ఎదురు చూసిన క్షణం అవిష్కృతమైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: దశాబ్ధాలపాటు హిందువులంతా ఎదురు చూసిన క్షణం అవిష్కృతమైంది. అయోధ్యలో శ్రీరాముని ఆలయానికి మోదీ చేతుల మీదుగా భూమిపూజ జరిగింది. ఇక రామరాజ్యం వస్తుందని అందరూ ఆశిస్తున్నారు. ముఖ్యంగా దేశం కోసం త్యాగం చేసిన అమరావతి రైతులు మాత్రం కన్నీరు పెడుతున్నారు. గురువారం రామాలయంలో రైతులు పూజలు చేశారు. ఇక రామరాజ్యం వస్తుందని.. తాము అన్యాయం అవకుండా రాముడు కాపాడుతాడని ఆశిస్తున్నారు. పెద్ద ఎత్తున సెలబ్రెటీలు కూడా ఇదే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త కొండవీటిజ్యోతిర్మాయితోపాటు సింగర్ స్మిత కూడా అదే అభిలాష వ్యక్తం చేశారు. ఆ రాముడే అమరావతి రైతులను ఆదుకోవాలని స్మిత సోషల్ మీడియా ద్వారా కోరారు.


ఇప్పటికే ఆర్ఎస్ఎస్ సహా అనేక హిందూ సంఘాలు అమరావతినే రాజధానిగా కొనసాగించాలని కోరుతున్నాయి. ఆర్ఎస్ఎస్ సిద్ధాంత కర్తలు ఈ మేరకు స్పష్టమైన ప్రకటనలు కూడా చేశారు. ఆర్ఎస్ఎస్ నేతలు దక్షిణాది అయోధ్యగా అమరావతిని మారుస్తామని ప్రకటించారు. భారీ రామాలయం నిర్మిస్తామని కూడా ప్రకటించారు. ఈ తరుణంలో అమరావతి రైతులకు మద్ధతు పెరుగుతోంది. రూపాయి ఆశించకుండా అమరావతికి రైతులు భూములిచ్చారు. అమరావతి అభివృద్ధి చెందితే రాష్ట్రం బాగుపడుతుందని, రాష్ట్రంతోపాటు తాముకూడా బాగుపడతామని ఆశించినవారికి కొత్త ప్రభుత్వం తీరుతో నిరాశే ఎదురవుతోంది. కాగా రైతులకు సెలబ్రెటిల నుంచి మద్దతు లభిస్తోంది.

Updated Date - 2020-08-05T20:59:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising