ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధాన్యం కొను‘గోల’!

ABN, First Publish Date - 2020-04-12T06:58:08+05:30

ప్రభుత్వం ధాన్యం కొనుగోలుకు పరిమితులు విధించడం రైతులను ఇబ్బందులకు గురిచేస్తోంది. గత ఖరీ్‌ఫలో ఎకరాకు 2.88 టన్నుల మేర కొనుగోలు చేసేందుకు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ఎకరానికి 2.88 టన్నులకే అనుమతి
  • పరిమితి పెంచాలని రైతుల డిమాండ్‌ 

తాడేపల్లిగూడెం, ఏప్రిల్‌ 11 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం ధాన్యం కొనుగోలుకు పరిమితులు విధించడం రైతులను ఇబ్బందులకు గురిచేస్తోంది. గత ఖరీ్‌ఫలో ఎకరాకు 2.88 టన్నుల మేర కొనుగోలు చేసేందుకు అనుమతిచ్చింది. ఇప్పు డు అదే పరిమితిని రబీకి వర్తింపజేయడం విమర్శలకు దారితీస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లాలో రబీ సీజన్‌లో ఎకరాకు నాలుగు టన్నులకు పైగా ధాన్యం దిగుబడి ఉంటుంది. సగటున 55 బస్తాల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం మాత్రం ఎకరాకు 2.88 టన్నుల కొనుగోలుకు పరిమితి విధించడంతో మిగులు ధాన్యాన్ని ఎలా విక్రయించాలన్న విషయమై రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ రబీ లో 13.60 లక్షల టన్నులు దిగుబడి వస్తుందని అంచనా.


రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత సీజన్‌లో జిల్లాలో 10 లక్షల టన్ను ల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించింది. అందుకు అనుగుణంగా ప్రతి మండలంలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నారు. జిల్లా నుంచి కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాలకు కొంతమేర ధాన్యం ఎగుమతులు జరుగుతుంటాయి. మిగిలిన ధాన్యాన్ని రైతులు జిల్లాలోనే అమ్ముకోవాల్సి ఉంటుంది. అయితే  రబీ ధాన్యానికి బహిరంగా మా ర్కెట్‌లో అంతగా డిమాండ్‌ ఉండదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం విధించిన కొనుగోలు పరిమితితో దళారులకే ప్రయోజనం చేకూరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం కొనుగోలు చేయగా మిగిలిన ఽధాన్యాన్ని దళారులు మద్దతు ధర కంటే తక్కువకు కొనుగోలు చేస్తారు. తాము నష్టపోకుండా ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు పరిమితిని పెంచాలని, ఆ దిశగా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.


Updated Date - 2020-04-12T06:58:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising