ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రభుత్వం కీలక సూచనలు

ABN, First Publish Date - 2020-04-09T03:47:25+05:30

నోవెల్ కరోనా వైరస్ (కోవిడ్- 19) నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతాంగం వ్యవసాయ పనులకు అంతరాయం ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు, ఆంధ్రప్రదేశ్: నోవెల్ కరోనా వైరస్ (కోవిడ్- 19) నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతాంగం వ్యవసాయ పనులకు అంతరాయం కలుగకుండా కొనసాగించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో నెంబర్ 53 విడుదల చేసింది.


జీవో నెంబర్ 53లోని కీలక అంశాలు

వ్యవసాయ కూలీలు వ్యవసాయ పనులు చేయడానికి మధ్యాహ్నం 1 గంట వరకు అనుమతి ఇచ్చారు.

వ్యవసాయ కూలీలు పొలాలకు పోవడానికి మధ్యాహ్నం 1 గంట వరకు అనుమతి ఉంటుంది. 

వ్యవసాయ కూలీలు పొలం పనులు చేస్తున్నప్పుడు భౌతిక దూరం పాటించాలని ప్రభుత్వం సూచించింది.

వ్యవసాయ సంబంధిత ట్రాక్టర్లు, హార్వెస్ట్‌ర్లు, కోత పనిముట్లు,ఇతర వ్యవసాయ పనిముట్ల రవాణాకు అనుమతి ఇచ్చారు.

వ్యవసాయ, ఉద్యానవన పంటలు రవాణాకు అనుమతి.

విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు రవాణాకు అనుమతి ఉంటుంది.

రైతులు పండించిన కూరగాయలు, పండ్లు, ఆహారధాన్యాలు ఇతర వాణిజ్య పంటల వికేంద్రీకరణ సేకరణను గ్రామ వ్యవసాయ సహాయకుడు, ఉద్యానవనం పంటల సహాయకుడు సులభతరం చేస్తారని ప్రభుత్వం తెలిపింది. వ్యవసాయ ఉత్పాధనలను రైతులు అవసరార్ధం బలవంతంగా తక్కువ ధరలకు అమ్మ వలసిన పరిస్థితి వస్తే 1907 టోల్ ఫ్రీ నెంబర్‌కు తెలపాలని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. జీవో నెంబర్ 53 ప్రతిని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరలను జతపరచడమైనది.



Updated Date - 2020-04-09T03:47:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising