ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అన్నదాతకు అంతులేని కష్టం!

ABN, First Publish Date - 2020-12-01T08:54:54+05:30

నారు పోసి.. నాట్లు వేసి.. కలుపుతీసి.. ఎరువు వేసి.. కంటికి రెప్పలా కాపాడుకున్న పంటనే రైతు ట్రాక్టర్‌తో ధ్వంసం చేశాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మోపిదేవి : నారు పోసి.. నాట్లు వేసి.. కలుపుతీసి.. ఎరువు వేసి.. కంటికి రెప్పలా కాపాడుకున్న పంటనే రైతు ట్రాక్టర్‌తో ధ్వంసం చేశాడు. కృష్ణా జిల్లా మోపిదేవి మండలం పెదప్రోలు పంచాయతీ శివారు కప్తానుపాలేనికి చెందిన అత్తలూరి రమేశ్‌ మూడెకరాలు కౌలుకు తీసుకున్నాడు. రూ.1.50 లక్షలు ఖర్చుచేసి బీపీటీ 5204 సాగు చేశాడు. పంట బాగానే పండింది. వారం పది రోజుల్లో పంట కోతకు రావల్సివుండగా.. ఇంతలో భారీ వర్షాలు వచ్చిపడ్డాయి. అధిక వర్షాలకు వరి మొత్తం నేలవాలింది. రోజుల తరబడి నీరు నిల్వ ఉండటంతో పంట కుళ్లిపోయి మొలకలు వచ్చింది. కోత కోయకపోవటంతో ప్రభుత్వ పరిహారం అందించేందుకు నమోదు చేయలేమని వ్యవసాయాధికారులు చెప్పారు. చేసిన కష్టాన్ని.. వచ్చిన నష్టాన్ని తలచుకుంటూ.. కోత కోసినా.. కూలి ఖర్చులు కూడా రావనే ఉద్దేశంతో.. సోమవారం ట్రాక్టర్‌ తీసుకొచ్చి కాసానగర్‌లోని తన పంటను దున్నేశాడు.

Updated Date - 2020-12-01T08:54:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising