ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పొలం వదలకపోతే.. చంపేస్తా!

ABN, First Publish Date - 2020-06-30T08:46:54+05:30

ఓ రైతుకు చెందిన 32 ఎకరాల పొలాన్ని స్వాధీనం చేసుకునేందుకు అధికార పార్టీ వైసీపీకి చెందిన విశాఖ జిల్లా ఎలమంచిలి ఎమ్మెల్యే యూవీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • రైతుకు వైసీపీ ఎమ్మెల్యే బెదిరింపు
  • కన్నబాబురాజుపై ఎస్పీకి రైతు కుటుంబం ఫిర్యాదు

విశాఖపట్నం, జూన్‌ 29(ఆంధ్రజ్యోతి): ఓ రైతుకు చెందిన 32 ఎకరాల పొలాన్ని స్వాధీనం చేసుకునేందుకు అధికార పార్టీ వైసీపీకి చెందిన విశాఖ జిల్లా ఎలమంచిలి ఎమ్మెల్యే యూవీ రమణమూర్తిరాజు(కన్నబాబురాజు) బెదిరింపులకు దిగారు. ‘‘తక్షణం పొలాన్ని వదిలి వెళ్లిపో.. లేకపోతే చంపేస్తా’’ అంటూ తన అనుచరులను పంపించి సదరు రైతు కుటుంబాన్ని భయభ్రాంతులకు గురిచేశారు. దీంతో బెదిరిపోయిన రైతు పైలా వెంకటస్వామి తన కుటుంబ సభ్యులతో కలసి జిల్లా ఎస్పీ కృష్ణారావును ఆశ్రయించారు. ఎమ్మెల్యే నుంచి తనకు, తన కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు.


నియోజకవర్గ పరిధిలోని అచ్యుతాపురం మండలం భోగాపురానికి చెందిన రైతు పైలా వెంకటస్వామి కుటుంబానికి చెందిన 32 ఎకరాల్లో ఉద్యాన తోటలున్నాయి. ఈ భూమికి సంబంధించిన వివాదం కోర్టులో ఉంది. అయితే, శనివారం రాత్రి ఆరుగురు వ్యక్తులు రైతు వెంకటస్వామి ఇంటికి వచ్చి తాము ఎమ్మెల్యే కన్నబాబురాజు, పీఆర్‌ఎస్‌ నాయుడు మనుషులమని, తక్షణం పొలం ఖాళీ చేయాలని, లేకపోతే.. చంపేస్తామని బెదిరించారు. దీంతో రైతు కుటుంబం ఎస్పీని ఆశ్రయించింది. కాగా, ఎస్పీ వారిని భయాందోళనకు గురికావద్దని చెప్పారు.


రెవెన్యూ అధికారుల పాత్ర కూడా ఉంది: రైతు

రైతు వెంకటస్వామి మీడియాతో మాట్లాడుతూ.. 32 ఎకరాలకు సంబంధించి తమ కుటుంబం ఈ నెల 18న పాస్‌ పుస్తకాల కోసం దరఖాస్తు చేస్తే వివాదంలో ఉందని చెప్పిన అచ్యుతాపురం తహసీల్దార్‌.. మూడు రోజుల వ్యవధిలోనే పీఆర్‌ఎస్‌ నాయుడితో మిలాఖత్‌ అయి మ్యుటేషన్‌కు యత్నించారని ఆరోపించారు. ఆర్‌ఐ ఈ మొత్తం వ్యవహారం నడిపిస్తున్నారన్నారు.  ఎమ్మెల్యే కన్నబాబురాజుపై ఎంపీ విజయసాయిరెడ్డి, సీఎం జగన్మోహన్‌రెడ్డికు కూడా ఫిర్యాదు చేస్తామన్నారు.  


ఆ రైతెవరో నాకు తెలియదు: ఎమ్మెల్యే కన్నబాబురాజు

రైతు వెంకటస్వామి తనపై చేసిన ఆరోపణలు అవాస్తవమని ఎమ్మెల్యే కన్నబాబురాజు అన్నారు. వెంకటస్వామి ఎవరో తనకు తెలియదని చెప్పారు. భోగాపురం భూమి విషయంలో ఎవరి పక్క న్యాయం ఉంటే వారికే పూర్తి మద్దతు ఇస్తానన్నారు.

Updated Date - 2020-06-30T08:46:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising