ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విజయవాడ: ప్రముఖ డాక్టర్‌ ఇంట్లో భారీ చోరీ

ABN, First Publish Date - 2020-09-15T00:45:35+05:30

మాచవరంలో ఓ ప్రముఖ డాక్టర్‌ ఇంట్లో భారీ చోరీ జరిగింది. రూ.50 లక్షల విలువైన సొత్తు ఎత్తుకెళ్లారు. డాక్టర్‌ భార్య, కూతురి చేతులు కట్టేసి చోరీకి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: మాచవరంలో ఓ ప్రముఖ డాక్టర్‌ ఇంట్లో భారీ చోరీ జరిగింది. రూ.50 లక్షల విలువైన సొత్తు ఎత్తుకెళ్లారు. డాక్టర్‌ భార్య, కూతురి చేతులు కట్టేసి చోరీకి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకున్నారు. క్లూస్ టీమ్ ఆధారాలు సేకరిస్తోంది. మరోవైపు సీపీ బత్తిన శ్రీనివాస్ కూడా సంఘటనాస్థలికి చేరుకుని పరిశీలిస్తున్నారు. తెలిసిన వారే చోరీకి పాల్పడ్డారని అనుమానిస్తున్నారు. సమీపంలోని సీసీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు.


డాక్టర్ ఇంట్లో గంట పాటు దుండగులున్నారు: డీసీపీ

డాక్టర్ మురళీధర్ ఇంట్లో చోరీ జరిగినట్లుగా సమాచారం వచ్చిందని డీసీపీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. ప్రాథమికంగా వచ్చిన సమాచారం ప్రకారం మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల మధ్యలో చోరీ జరిగి ఉంటుందని అభిప్రాయపడ్డారు. సీసీ ఫుటేజీ కోసం చూస్తున్నామన్నారు. బాధితులు ఇద్దరిని కొడతామని దుండగులు భయపెట్టినట్లు తెలిసిందని చెప్పారు. నలుగురు వ్యక్తులు మాస్కులు, గ్లౌవ్స్ వేసుకుని వచ్చి సొత్తు ఎత్తుకెళ్లినట్లు వెల్లడించారు. 


Updated Date - 2020-09-15T00:45:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising