ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘మళ్లీ కాంగ్రెస్‌లో చేరతా..’

ABN, First Publish Date - 2020-10-03T11:21:22+05:30

‘నేను తిరిగి కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నా. ఉత్తరప్రదేశ్‌లో దళిత బాలికపై అత్యాచారం, హత్య కేసులో బాధితులకు అండగా కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమహేంద్రవరం: ‘నేను తిరిగి కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నా. ఉత్తరప్రదేశ్‌లో దళిత బాలికపై అత్యాచారం, హత్య కేసులో బాధితులకు అండగా కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ, ప్రియాంక చేసిన పోరాటం చూస్తుంటే ఇందిరాగాంధీ రోజులు గుర్తుకొస్తున్నాయి. దేశంలో పేద, దళిత, మైనారిటీ ప్రజలకు అండగా ఉండేది.. ప్రజాస్వామ్యాన్ని కాపాడేది కాంగ్రెస్‌ ఒక్కటే’ అని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్‌ పేర్కొన్నారు.


ఆయన శుక్రవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. హీరోలా 120 కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లడానికి నిర్ణయించుకున్న రాహుల్‌ను పోలీసులు అడ్డుకున్న తీరు బాధాకరమన్నారు. 2009లో ప్రధాని కావాలనుకుంటే అయ్యేవారని.. కానీ మరింత అవగాహన కోసం ఆ పదవిని వదిలేశారని చెప్పారు. బీజేపీ దళిత వ్యతిరేక, వ్యాపారులు, కార్పొరేట్ల పార్టీ అని విమర్శించారు. సీఎం జగన్‌ రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడడంలేదని, ఎప్పుడూ తన కేసుల మాఫీ గురించి కేంద్రం కాళ్లు పట్టుకోవడానికే ఆయనకు సమయం సరిపోతోందని ఎద్దేవాచేశారు. వైసీపీ అధికారం చేపట్టినప్పటి నుంచి దళితులపై దాడులు జరుగుతున్నాయని, దాడి చేసేవారిని ప్రభుత్వం రక్షిస్తోందని ఆరోపించారు.

Updated Date - 2020-10-03T11:21:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising