మాజీ ఎమ్మెల్యే శివారెడ్డి కన్నుమూత
ABN, First Publish Date - 2020-05-08T22:15:10+05:30
కమలాపురం మాజీ శాసనసభ్యుడు పేర్ల శివారెడ్డి(83) కన్నుమూశారు. ఆయన గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. పొద్దుటూరులోని ఓ ప్రైవేటు ఆసపత్రితో చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. కమలాపురం శాసనసభ్యునిగా శివారెడ్డి 1978-83 మధ్య కాలంలో పనిచేశారు.
కడప : కమలాపురం మాజీ శాసనసభ్యుడు పేర్ల శివారెడ్డి(83) కన్నుమూశారు. ఆయన గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. పొద్దుటూరులోని ఓ ప్రైవేటు ఆసపత్రితో చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. కమలాపురం శాసనసభ్యునిగా శివారెడ్డి 1978-83 మధ్య కాలంలో పనిచేశారు.
ఆయన స్వతంత్ర అభ్యర్ధిగా అప్పటి ఎన్నికల్లో గెలుపొందారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఆయన అత్యంత సన్నిహితుడు. యర్రగుంట్ల మండలం యర్రగుంట్ల ఆయన స్వగ్రామం. ఆయన మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
పొద్దుటూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త డాక్టర్ జీవీ ప్రవీణ్‌కుమార్ రెడ్డి శివారెడ్డి భౌతికకాయం వద్ద నివాళులర్పించారు.
Updated Date - 2020-05-08T22:15:10+05:30 IST