ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెంటనే విధులకు హాజరుకండి.. లేకుంటే కఠిన చర్యలే: కలెక్టర్

ABN, First Publish Date - 2020-03-28T17:01:49+05:30

తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కొందరు తమ ఇళ్లు వదిలి బయటకు వచ్చేందుకు భయపడిపోతున్నారు. కొందరు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు: తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కొందరు తమ ఇళ్లు వదిలి బయటకు వచ్చేందుకు భయపడిపోతున్నారు. కొందరు ఉద్యోగులు తమ ఇళ్ల వద్దే ఉండి విధులు నిర్వహిస్తున్నారు. అయితే కరోనా వైరస్ వ్యాప్తిని సాకుగా పెట్టుకొని ఏలూరు ప్రభుత్వ కార్యాలయాలకు చెందిన అధికారులు తమ విధులకు హాజరుకావడం లేదు. ఈ విషయం జిల్లా కలెక్టర్ ముత్యాల రాజు దృష్టికి వెళ్లడంతో.. ఆయన దీనిపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.


‘‘జిల్లా ప్రభుత్వ కార్యాలయాల్లో కొందరు అధికారులు తమ విధులకు హాజరుకావడంలేదని అంతేకాక.. మండల ప్రధాన కార్యాలయాల్లో కూడా అధికారులు అందుబాటులో ఉండటం లేదనే విషయం మా దృష్టికి వచ్చింది. కోవిడ్-19ను కేంద్రం జాతీయ విపత్తుగా ప్రకటించిన నేపథ్యంలో దానిపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం మనందరికీ ఉంది. వైరస్ వ్యాప్తిని కరికట్టేందుకు తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిని ప్రజలకు అందజేయాల్సిన బాధ్యత మనది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని జిల్లా వ్యాప్తంగా అధికారులు తమ కార్యాలయాకు వచ్చి తమ విధులను కచ్చింతగా నిర్వహించాలని ఆదేశిస్తున్నాను. అధికారులు సమయపాలను పాటిస్తూ.. తమ విధులు నిర్వర్తిస్తున్నారా లేదా అనే విషయాన్ని ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు గమనించాలి. ప్రభుత్వం ఆదేశించిన నిర్ధిష్ట సమయంలో మండల అధికారులు తమ కార్యాలయాల్లోనే ఉండాలి. ఈ ఆదేశాలను ఎవరు పాటించకపోయినా దాన్ని క్రమశిక్షణ రాహిత్యంగా భావించి కఠిన చర్యలు తీసుకుంటాము’’ అంటూ కలెక్టర్ నోటీసు జారీ చేశారు. 


Updated Date - 2020-03-28T17:01:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising