ఎన్నికల ప్రక్రియనే రద్దు చేయాలి!
ABN, First Publish Date - 2020-03-16T09:22:38+05:30
రాష్ట్రంలో స్థానికసంస్థల ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేసిన రాష్ట్ర ఎన్నికల కమిషన్(ఎ్‌సఈసీ) ఇప్పటికే అభ్యర్థులు వేసిన నామినేషన్లు చెల్లుబాటయ్యేలా ప్రకటించడంపై భిన్నాభిప్రాయాలు
- నామినేషన్లు వేయలేని వారికి అన్యాయమే
- మళ్లీ నోటిఫికేషన్‌తోనే న్యాయం: నిపుణులు
అమరావతి, మార్చి 15(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో స్థానికసంస్థల ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేసిన రాష్ట్ర ఎన్నికల కమిషన్(ఎ్‌సఈసీ) ఇప్పటికే అభ్యర్థులు వేసిన నామినేషన్లు చెల్లుబాటయ్యేలా ప్రకటించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం, పత్రాలు చించివేయడం, ఫోన్ల ద్వారా బెదిరించడం, డబ్బు ఎరవేసి నామినేషన్ పత్రాలు తీసుకోవడం తదితర ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ పరిస్థితుల్లో ఎన్నికలు వాయిదా వేసినంత మాత్రాన పెద్దగా ఉపయోగం లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికే పలు జడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ వార్డులు ఏకగ్రీవం కావడంతో ఎన్నికల వాయిదా వల్ల బాధితులకు పూర్తి న్యాయం జరిగే అవకాశం లేదంటున్నారు. మొత్తం ఎన్నికల ప్రక్రియను నిలిపేస్తే బాఽధితులకు న్యాయం చేసినట్లు అవుతుందని పేర్కొంటున్నారు. ఇప్పటికే జరగాల్సిన అన్యాయం జరిగిందని, ఏకగ్రీవంగా ఎన్నికైన వారిని ఆమోదించడం, ఇప్పటికే పోటీ పడాల్సిన వారు పోటీలో లేకపోవడం వల్ల తీవ్ర అన్యాయం జరిగినట్లే భావిస్తున్నారు. ఎస్‌ఈసీ మొత్తం ఎన్నికల ప్రక్రియను రద్దు చేసి మళ్లీ ఎన్నికల నోటిఫికేషన్లు, షెడ్యూల్‌ను కొత్తగా ప్రకటించాలని పలు పార్టీలు, నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Updated Date - 2020-03-16T09:22:38+05:30 IST