ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దశలవారీగా విద్యాసంస్థలు ప్రారంభించాలి: సోము వీర్రాజు

ABN, First Publish Date - 2020-08-15T01:35:52+05:30

కొవిడ్ -19 కేసులు బాగా పెరుగుతున్న నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో విద్యాసంస్థలు పూర్తి భద్రతా చర్యలు తీసుకున్న తర్వాత మాత్రమే దశలవారీగా ప్రారంభించాలని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: కొవిడ్ -19 కేసులు బాగా పెరుగుతున్న నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో విద్యాసంస్థలు పూర్తి భద్రతా చర్యలు తీసుకున్న తర్వాత మాత్రమే దశలవారీగా ప్రారంభించాలని బీజేపీ నేత సోము వీర్రాజు సూచించారు. రాష్ట్రంలో విద్యాసంస్థలను సెప్టెంబరు 5 నుంచి ప్రారంభించాలని విద్యాశాఖ నిర్ణయించిందని తెలిపారు. ఒకే సారి కళాశాలలు, జూనియర్ కళాశాలలు, పాఠశాలలు ప్రారంభించడం వల్ల లక్షలాది సంఖ్యలో విద్యార్ధులు కలుస్తారని, ఇప్పటికే రోజూ అత్యధికంగా నమోదవుతున్న కరోనా కేసులు మరింత బాగా పెరిగిపోయి ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికాలో ఇలాగే ఒకేసారి విద్యాసంస్థలు ప్రారంభించినందువల్ల 80 వేల వరకు కేసులు నమోదయ్యాయని గుర్తుచేశారు. పబ్లిక్ ట్రాన్స్ పోర్టు మీద ఆధారపడి 60 శాతం మంది విద్యార్థులు చదువుతున్నారని, బస్సులు ప్రారంభించకుండా ఎలా విద్యాసంస్థలకు వస్తారని వీర్రాజు ప్రశ్నించారు. 

Updated Date - 2020-08-15T01:35:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising