ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పవన్ విజ్ఞప్తిపై స్పందించిన తమిళనాడు సీఎం

ABN, First Publish Date - 2020-03-30T20:19:51+05:30

ఏపీ మత్స్యకారులను ఆదుకోవాలంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన విజ్ఞప్తిపై తమిళనాడు సీఎం ఈకే పళనిస్వామి స్పందించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: ఏపీ మత్స్యకారులను ఆదుకోవాలంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన విజ్ఞప్తిపై తమిళనాడు సీఎం ఈకే పళనిస్వామి స్పందించారు. సంబంధిత శాఖకు దీనిపై ఆదేశాలు జారీ చేస్తామని.. వారిని జాగ్రత్తగా చూసుకుంటామని ట్విట్టర్ వేదికగా హామీ ఇచ్చారు. తమ దృష్టికి తీసుకొచ్చినందుకు పవన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. 


ఏపీలోని శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం సీహెచ్ చొలగండి గ్రామానికి చెందిన సుమారు 30 మంది మత్స్యకారులు చేపల వేట కోసం తమిళనాడు వెళ్లారు. లాక్‌డౌన్ కారణంగా చెన్నై హార్బర్‌ దగ్గర చిక్కుకుపోయారు. ఈ విషయం తమ పార్టీ నాయకుల ద్వారా తెలుసుకున్న జనసేన చీఫ్ పవన్ కల్యాణ్.. వారిని ఆదుకోవాలంటూ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, తమిళనాడు ముఖ్యమంత్రి ఈకే పళనిస్వామిలను ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేశారు. పళనిస్వామికి తమిళంలో ప్రత్యేకంగా మరో ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన పళని..  వారి బాగోగులు చూసుకుంటామని ట్విట్టర్ ద్వారా తెలిపారు. మరోవైపు ఏపీ సీఎంవో నుంచి ఇప్పటి వరకు కనీస స్పందన లేకపోవడంపై నెట్టింట విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  



Updated Date - 2020-03-30T20:19:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising