ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇళ్లు కట్టకుండానే.. కాలనీలకు పేర్లా!

ABN, First Publish Date - 2020-12-29T07:18:04+05:30

వైసీపీ ప్రభుత్వం నిరుపేదలకు ఇళ్ల స్థల పట్టాల పంపిణీ..

పి.గన్నవరం మండలం రాజుపాలెంలో లేఅవుట్‌కు వైఎస్‌ జగన్మోహనపురం పేరు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వైసీపీ హంగామా!

ఇళ్ల స్థల పట్టాల పంపిణీ.. కాలనీలకు నామకరణాలు

వైఎస్సార్‌ కుటుంబీకుల పేరిట లేఅవుట్లలో ఫ్లెక్సీలు

ఇళ్లు కట్టకుండానే కాలనీలకు పేర్లా అంటున్న లబ్ధిదారులు


(అమలాపురం-ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వం నిరుపేదలకు ఇళ్ల స్థల పట్టాల పంపిణీ ప్రారం భించిందో లేదో ఆయా ప్రాంతాలకు జగన్మోహనపురాల పేరిట నామ కరణాలు చేసేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా పట్టాలు పంపిణీ చేపట్టిన ప్రాంతాల్లో వైఎస్‌ జగన్మోహనపురం, వైఎస్సార్‌ కాలనీ, జగనన్నకాలనీ ఇలా రకరకాల పేర్ల పేరిట ఆయా భూములకు నామకరణాలు చేస్తూ వైఎస్సార్‌ పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ఆలూ లేదు.. చూలూ లేదు.. అన్న చందంగా కాలనీలకు ఏర్పాటవుతున్న ఫ్లెక్సీలను చూసి లబ్ధిదారులు సైతం విమర్శనాస్ర్తాలు సంధిస్తున్నారు. ఈనెల 25న జగన్మోహన్‌రెడ్డి ఇళ్ల స్థల పట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టారు. కానీ కొన్నిచోట్ల మాత్రమే మొక్కుబడిగా లేఅవుట్లను సిద్ధంచేసి వాటిలోనే ఎంపిక చేసిన లబ్ధిదారులకు పట్టాల పంపిణీ చేయడంలో ప్రజాప్రతినిధులు బిజీబిజీగా ఉన్నారు.


జిల్లాలో తొలి విడతలో 1.53 లక్షల ఇళ్లను రూ.2,765 కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణాలకు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇవన్నీ పూర్తయితే 110కు పైగా గ్రామాలు ఆవిర్భవిస్తాయనేది జిల్లా అధికారుల అంచనా. అమలాపురం రెవెన్యూ డివిజన్‌ పరిధిలో ఇరవై ప్రాంతాలు ఇలా అభివృద్ధి చెందుతాయని అధికారులు అంచనాల్లో ఉన్నారు. అయితే ప్రభుత్వం నిర్ణయించిన సమయానికి కేవలం ఎంపిక చేసిన లబ్ధిదారుల్లో కొందరికి మాత్రమే ఆయా గ్రామాల్లో పట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టారు. రోడ్లు, ఇతర ఎటువంటి మౌలిక సదుపాయాలు లేకుండానే పట్టాల పంపిణీ కార్యక్రమాల రోజునే జగన్‌ పేరిట నామకరణాలు చేస్తున్నారు. దీనిలో భాగంగా పి.గన్నవరం నియోజకవర్గపరిధిలోని రాజుపాలెం, నరేంద్రపురం గ్రామాలకు చెందిన 120 మంది లబ్ధిదారులకు రాజుపాలెంలో సోమవారం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు నేతృత్వంలో పట్టాలు పంపిణీ చేశారు.


లేఅవుట్‌ మాత్రమే పూర్తిచేసిన ఆ ప్రాంతానికి వైఎస్‌ జగన్మోహనపురంగా నామకరణం చేస్తూ భారీఎత్తున హోర్డింగులు ఏర్పాటు చేశారు. గతంలో అయితే కాలనీలు నిర్మించి పూర్తయిన తరువాతే నేతల పేర్లను పెట్టేవారని, ఇప్పుడు లబ్ధిదారుల చేతిలో పట్టాలు పెట్టి ఆ లేఅవుట్‌కి జగన్‌ పేరిట నామకరణాలు చేసి వైఎస్సార్‌ సీపీ శ్రేణులు చేస్తున్న హంగామా పట్ల లబ్ధిదారులు తీవ్రస్థాయిలో విమర్శనాస్ర్తాలు సంధిస్తున్నారు. గత ప్రభుత్వాల హయాంలో కూడా పట్టాలు ఇచ్చినప్పటికీ ఆ భూముల్లో ఎటువంటి నిర్మాణాలు చేపట్టకుండా దశాబ్ధాల నుంచి వదిలేశారని, ప్రస్తుత ప్రభుత్వం లబ్ధిదారులకు ఇచ్చిన హామీ మేరకు కాలనీలు నిర్మిస్తుందా లేదా అన్నది వేచి చూడాల్సిందే.

Updated Date - 2020-12-29T07:18:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising