ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అధ్వానంగా పాఠశాల పరిసరాలు

ABN, First Publish Date - 2020-10-07T08:42:15+05:30

పి.గన్నవరం మెయిన్‌ ప్రాథమిక పాఠశాల పరిస్థితి లోపల ఇంపు... బయట కొంపు సామెతను తలపిస్తోంది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పి.గన్నవరం, అక్టోబరు 6: పి.గన్నవరం మెయిన్‌ ప్రాథమిక పాఠశాల పరిస్థితి లోపల ఇంపు... బయట కొంపు సామెతను తలపిస్తోంది. ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి కోసం నాడు-నేడు కార్యక్రమాన్ని ప్రభుత్వం రూపొందించింది. దీంతో మెయిన్‌ ప్రాఽథమిక పాఠశాలను నాడు-నేడులో భాగంగా ముస్తాబు చేస్తున్నారు. ఆ ప్రాంతంలో డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో స్థానిక శివాలయం నుంచి పాఠశాల వరకు వర్షం వస్తే చాలు రహదారి పూర్తిగా జలయమం అవ ుతుంది. వర్షం నీరు రోజుల తరబడి నిల్వ ఉండ టంతో ఆ దారిలో రాకపోకలు సాగించే విద్యా ర్థులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 


దోమలు వ్యాపించి అంటువ్యాధులు ప్రబలుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో డ్రైనేజీ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారని, కార్యరూపం దాల్చలేదని స్థానికులు వాపోతున్నారు. పాఠశాలలను అభివృద్ధి చేస్తే సరిపోదని, పరిసరాలను కూడా అభివృద్ధి చేస్తే విద్యార్థులతో పాటు స్థానికులకు ఇబ్బందులు తప్పుతాయని పలువురు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పాఠశాలకు వెళ్లే రహదారికి డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. 

Updated Date - 2020-10-07T08:42:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising