ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

10 ర్యాంపులు ఉన్నా ఎందుకు తెరవరు..

ABN, First Publish Date - 2020-06-06T09:00:07+05:30

కొత్తపేట నియోజకవర్గంలో పది ఇసుక ర్యాంపులు ఉన్నప్పటికీ వాటిని తెరిచి వినియోగదా రులకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పొలాల్లో మట్టి తొలగించుకుంటున్న రైతులపైనా కేసులా.. అధికారులపై ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ధ్వజం


రావులపాలెం రూరల్‌, జూన్‌ 5: కొత్తపేట నియోజకవర్గంలో పది ఇసుక ర్యాంపులు ఉన్నప్పటికీ వాటిని తెరిచి వినియోగదా రులకు ఇసుక ఎందుకు అందుబాటులోకి తేవడం లేదో అధికా రులు సమాధానం చెప్పాలని ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. రావులపాలెం సీఆర్‌సీ మీటింగ్‌ హాలులో ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏఎస్పీ గరుడ్‌ సుమీత్‌సునీల్‌ ఆధ్వర్యం లో ఇసుక, బొండుమట్టి, పంటచేలలో మట్టి అంశాలపై అమలా పురం డీఎస్పీ మాసుమ్‌బాషా, సీఐ వి కృష్ణ, మోటార్‌ వైహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ పరదామరెడ్డిలతోపాటు నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాలకు చెందిన తహశీల్దార్లు, ఎంపీడీవోలు, ఎస్‌ఐలు, మైన్స్‌, ఇరిగేషన్‌, రైతులు, ఇటుకబట్టీల నిర్వాహకులతో అవగాహన సదస్సు నిర్వహించారు.


ఈ సమావేశంలో ఎమ్మెల్యే జగ్గిరెడ్డి మాట్లాడుతూ వినియోగదారులకు ఇసుక అందించడం లో ఏపీఎండీసీ పూర్తిగా విఫలమైందన్నారు. ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలిచ్చేందుకు భూములు సేకరించడం జరిగిందన్నారు. వాటిని పూడ్చేందుకు అనుమతి పొందిన బొండుమట్టి లారీలు 24 గంటలు తిరిగేందుకు అధికారులు అనుమతి ఇస్తేనే త్వరిత గతిన పూడ్చి పేదలకు ఇళ్ల పట్టాలు అందివ్వడం జరుగుతుంద న్నారు. ఇక రైతులు తమ పంట పొలాల్లో మట్టిని తరలించుకునే హక్కు వారికి ఉందని, అలా తరలించుకునే రైతులపై కేసులు పెట్టడం సరికాదన్నారు. అలాగే ఇటుకల తయారీకి అధికారుల తీరుతో సమస్య ఏర్పడిందని, అనుమతుల పేరుతో బట్టీల యజమానులను వేధించడం సరికాదన్నారు. ముడిసరుకుగా ఉప యోగపడే మట్టిని తరలించుకోవడానికి వారికి అనుమతులను వెంటనే అందజేయాలని కోరారు.


నిబంధనల ప్రకారమే తరలింపు : సుమీత్‌ సునీల్‌

జిల్లాలో ఎక్కడైనా నిబంధనల ప్రకారమే ఇసుక మట్టి తర లింపు జరగాలని స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏఎస్పీ గరుడ్‌ సుమీత్‌ సునీల్‌ అన్నారు. ఈ అవగాహన సదస్సు ముఖ్య ఉద్దేశం అన్ని శాఖల అధికారులు అటు సమన్వయంతో పనిచేయాలని, ఇటు వారి వద్ద నుంచి అనుమతులు తీసుకున్న తర్వాతే తవ్వకాలు, తోలకాలు జరిపితే ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు.


స్థానికంగా ఇచ్చే అనుమతులకు తహశీల్దార్‌, మైన్‌ శాఖ అధికారులతో మాట్లాడి ప్రత్యేక అనుమతులు వెంటనే అందజేయాలన్నారు. ఇటుకబట్టీల వారి సమస్యలపై జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామన్నారు. అదేవిధంగా మైన్స్‌ శాఖ అధికారులు కూడా ఆయా మండ లాల్లో అందుబాటులో ఉండే విధంగా చూసేందుకు కలెక్టర్‌ దృష్టిలో పెడతానన్నారు. బొండు నెపంతో ఇసుకను తరలిస్తే జిల్లాలో తిరుగుతున్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ టీమ్‌లు వాహనాలను సీజ్‌ చేసి కేసులు నమోదు చేస్తాయని చెప్పారు.

Updated Date - 2020-06-06T09:00:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising