ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనాలి: వర్మ

ABN, First Publish Date - 2020-11-29T05:56:39+05:30

వర్షానికి తడిచిన ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మ ప్రభుత్వాన్ని కోరారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పిఠాపురం రూరల్‌, నవంబరు 28: వర్షానికి తడిచిన ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మ ప్రభుత్వాన్ని కోరారు. మల్లాం, కందరాడ, భోగాపురం, రాపర్తి, జల్లూరు గ్రామాల్లో పంట పొలాలను పరిశీలించారు. వర్షానికి పంట నష్టపోయిన రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ తుఫాన్‌ వల్ల రైతాంగం పూర్తిగా నష్టపోయిందన్నారు. ఎకరాకు రూ.25వేలు ఇచ్చి ఆదుకోవాలన్నారు. జేసీ, కలెక్టర్లు పర్యటిస్తున్నారు తప్పితే ధాన్యం కొనుగోలు చేపట్టడం లేదన్నారు. రంగు మారిన, తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలన్నారు. కార్యక్రమంలో సకుమళ్ల గంగాధర్‌, బర్ల అప్పారావు, మలిరెడ్డి వెంకటరణమణ, పిల్లా విశ్వనాథం, శివ, బత్తిన వీరబాబు, ఎద్దు నాగేశ్వరరావు పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-29T05:56:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising