ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అర్హులందరికీ సంక్షేమ పథకాలు: జేసీ

ABN, First Publish Date - 2020-09-24T08:05:57+05:30

అర్హులైన ప్రతిఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూడాలని వార్డు కార్యదర్శులకు జాయింట్‌ కలెక్టర్‌ రాజకుమారి సూచించారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తుని, సెప్టెంబరు 23: అర్హులైన ప్రతిఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూడాలని వార్డు కార్యదర్శులకు జాయింట్‌ కలెక్టర్‌ రాజకుమారి సూచించారు. బుధవారం తుని మున్సిపాలిటీ పరిధిలో 16 సచివాలయాలను ఆమె సందర్శించి సంక్షేమ పథకాలు అందుతున్న తీరును క్షుణ్ణంగా పరిశీలించారు. సంక్షేమ పథకాల అర్హతలకు సంబంధించి సచివాలయంలో ప్రదర్శించిన పోస్టర్లను పరిశీలించారు. వైఎస్సార్‌ బీమా, జగనన్న తోడు పథకాలకు సంబంధించి ప్రస్తుతం సచివాలయాల ద్వారా జరుగుతున్న కార్యకలాపాలను ఆమె అడిగి తెలుసుకున్నారు. రైస్‌కార్డు, పింఛను కార్డు, ఇళ్ల స్థలాలు, వివిధ సర్వీసులకు ప్రజల నుంచి వస్తున్న దరఖాస్తులు వాటిని పరిష్కరిస్తున్న తీరును పరిశీలించారు. మరింత సమర్థవంతంగా సేవలు అందించేందుకు సచివాలయాల సిబ్బందికి జేసీ పలు సూచనలు చేశారు. 

Updated Date - 2020-09-24T08:05:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising