ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జిల్లాలో లక్ష నమూనాలు పరీక్షిస్తాం

ABN, First Publish Date - 2020-04-12T11:17:57+05:30

వైరస్‌ వ్యాప్తిని నియంత్రించేందుకు జిల్లాలో కనీసం లక్ష మంది నమూనాలు తీసుకుని పరీక్షించే లక్ష్యంతో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశాం 

 స్వచ్ఛందంగా పరీక్షలకు ముందుకు రావాలి

  రెడ్‌జోన్ల పర్యవేక్షణాధికారి కాంతిలాల్‌ దండే

 వైరస్‌పై విస్తృత ప్రచారం.. కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి


కాకినాడ, ఏప్రిల్‌11(ఆంధ్రజ్యోతి): వైరస్‌ వ్యాప్తిని నియంత్రించేందుకు జిల్లాలో కనీసం లక్ష మంది నమూనాలు తీసుకుని పరీక్షించే లక్ష్యంతో పనిచేస్తున్నామని   జిల్లాలో రెడ్‌జోన్ల పర్యవేక్షణాధికారి కాంతిలాల్‌ దండే వెల్లడించారు. కలెక్టరేట్‌లో శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ పొడిదగ్గు, జ్వరం ఉంటే వెంటనే స్వచ్ఛందంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న ఉచిత పరీక్షలు చేయించుకోవాలన్నారు. 


సర్వే నిర్వహిస్తున్న సిబ్బందికి ప్రజలు సహకరించాలని కోరారు. కలెక్టర్‌ మురళీధర్‌ రెడ్డి మాట్లాడుతూ ఇప్పటి వరకు 17 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయన్నారు. కత్తిపూడిలో ఒక వ్యక్తి అశ్రద్ధ వల్ల మరికొంత మందికి ఈ వ్యాధి సోకిందన్నారు. పాజిటివ్‌ కేసులు నమోదైన చోట్ల సమీప ప్రాంతాలను రెడ్‌జోన్లుగా ప్రకటించామన్నారు. అక్కడ ప్రజలకు నిత్యావసర సరుకులు డోర్‌ డెలివరీ చేస్తున్నామన్నారు. పాజిటివ్‌ కేసులు ఉన్న వారి ఇంట్లో మెరుగైన సౌకర్యాలు ఉంటే ప్రభుత్వ వైద్యులు ఆ ఇంటికి వెళ్ళి వైద్యం అందిస్తారన్నారు. మాస్కులు, పీపీఈ కిట్లకు కొరత లేదన్నారు.


ఆర్టీసీ సిబ్బందికి 3 వేల మాస్కులు పంపామన్నారు. ఏప్రిల్‌ 14 వరకు నిత్యావసర సరుకులు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా అన్ని ఏర్పాటు చేశామన్నారు. సమావేశంలో ఎస్పీ అద్నాన్‌నయీం అస్మీ, జేసీ లక్ష్మీశ, జేసీ-2 రాజకుమారి తీసుకున్న చర్యలపై వివరించారు. 

Updated Date - 2020-04-12T11:17:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising