ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకారులను ప్రోత్సహించాలి

ABN, First Publish Date - 2020-10-18T05:30:00+05:30

గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకారులను ప్రోత్సహించడానికి దాతలు ముందుకు రావాలని రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ పిలుపునిచ్చారు.

కడియపులంకలో ఇండోర్‌ స్టేడియాన్ని ప్రారంభిస్తున్న ఎంపీ భరత్‌రామ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమహేంద్రవరం ఎంపీ భరత్‌రామ్‌
కడియపులంకలో ఇండోర్‌ బ్యాడ్మింటన్‌ స్టేడియం ప్రారంభం


కడియం, అక్టోబరు 18: గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకారులను ప్రోత్సహించడానికి దాతలు ముందుకు రావాలని రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ పిలుపునిచ్చారు. కడియపులంకలో ఆదివారం తిరుమలశెట్టి సుబ్బాయ్యమ్మ ఇండోర్‌ బ్యాడ్మింటన్‌ స్టేడియాన్ని ఎంపీ భరత్‌రామ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్‌రామ్‌ మాట్లాడుతూ కడియపులంకలో స్టేడియం నిర్మించడం హర్షణీయమిన, తల్లి పేరిట స్టేడి యం నిర్మించిన తిరుమలశెట్టి గంగరాజును ఎంపీ అభినందించారు. క్రీడల ద్వారా జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు పొందే అవకాశం ఉందన్నారు. రాజమహేంద్రవరం కేంద్రంగా ఉభయగోదావరి జిల్లాల్లో స్పోర్ట్స్‌ హబ్‌ తీర్చిదిద్దుతున్నట్టు ఎంపీ భరత్‌రామ్‌ తెలిపారు. ముఖ్యమత్రి  జగన్‌ ప్రోత్సాహంతో ఏర్పాటు చేసే ఈ స్పోర్ట్స్‌హబ్‌లో ఇండోర్‌స్టేడియంతో పాటు ఒలింపిక్‌ ప్రమాణాలు కలిగిన స్విమ్మింగ్‌ఫూల్‌, పుట్‌బాల్‌కోర్టు వంటివి నిర్మించనున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో జనసేన నాయకుడు కందుల దుర్గేష్‌, వైసీపీ రూరల్‌ కోఆర్డినేటర్‌ ఆకుల వీర్రాజు, రాష్ట్ర కార్యదర్శులు రావిపాటి రామచంద్రరావు, గిరజాల బాబు, మండలాధ్యక్షుడు యాదల స్టాలిన్‌, టీడీపీ నాయకులు మార్గాని సత్యనారాయణ, అన్నందేవుల చంటి, నర్సరీసంఘం అధ ్యక్షుడు పుల్లా చంటియ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-18T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising