వికాస ఆధ్వర్యంలో ఉద్యోగావకాశాలు
ABN, First Publish Date - 2020-11-13T08:06:33+05:30
వికాస ఔట్ సో ర్సింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో నిరుద్యోగుల ఉపాధి కల్పనలో భా గంగా ఫోన్‌లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నామని పీడీ కె.లచ్చారావు తెలిపారు. కియా మోటార్స్ అనుబంధ సంస్థ హోం డాయ్ మొబీ్‌సలో పలు ఉద్యోగాలు ఉన్నాయని చెప్పారు.
కాకినాడ, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): వికాస ఔట్ సో ర్సింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో నిరుద్యోగుల ఉపాధి కల్పనలో భా గంగా ఫోన్‌లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నామని పీడీ కె.లచ్చారావు తెలిపారు. కియా మోటార్స్ అనుబంధ సంస్థ హోం డాయ్ మొబీ్‌సలో పలు ఉద్యోగాలు ఉన్నాయని చెప్పారు. టె క్నీషియన్ ఉద్యోగానికి బీటెక్‌లో మెకానికల్, ఈఈఈ, ఈసీఈ, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ 2019-20 ఉత్తీర్ణులైనవారు అర్హులన్నారు. ఇవే బ్రాంచ్‌లో డిప్లోమా చదివి 2017 నుంచి 2020లో ఉత్తీర్ణులైన వారు అర్హులన్నారు. అభ్యర్థులు 5 అడుగుల ఎత్తు, 50 కిలోల బరువు పైబడి ఉండాలన్నారు. ఎంపికైనవారికి నెలకు రూ.12వేల జీతంతోపాటు ఉచిత భోజనం, రవాణా సదుపాయం ఉంటుందన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు 8019185102, 9347505303 నెంబర్లలో పేర్లు రిజిస్టర్ చేసుకోవాలన్నారు. ప్రముఖ సెల్‌ఫోన్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ లో మొబైల్ టెక్నీషియన్‌లుగా పనిచేయడానికి టెన్త్, ఇంటర్, డిప్లోమా, ఏదైనా డిగ్రీ, బీటెక్ పాస్ /ఫెయిల్ అయిన 30ఏళ్లలోపు మహిళలు అర్హులన్నారు. ఎంపికైనవారికి నెలకు రూ.10,900 జీతంతోపాటు ఉచిత భోజనం, రవాణా సదుపాయం ఉంటుందన్నారు. వివరాలకు 7799376222, 9666600877 నెంబర్లలో సంప్రదించాలని కోరారు.
Updated Date - 2020-11-13T08:06:33+05:30 IST