విద్యార్థులు సాంకేతికతపై పట్టు సాధించాలి
ABN, First Publish Date - 2020-12-29T06:23:57+05:30
నేటి తరం విద్యార్థులు సాంకేతికతపై పట్టు సాధించి సమాజానికి మేలుచేసే వినూత్నమైన ప్రాజెక్టులను చేపట్టి సమస్యలకు పరిష్కార మార్గాలను కనుగొనాలని ఏపీఎస్సీహెచ్‌ఈ చైర్మన్ కె.హేమచంద్రారెడ్డి సూచించారు.
- ఏసీఎస్సీహెచ్‌ఈ చైర్మన్ హేమచంద్రారెడ్డి
- జేఎన్టీయూకేలో ప్రారంభమైన అంతర్జాతీయ సదస్సు
జేఎన్ట్టీయూకే, డిసెంబరు 28: నేటి తరం విద్యార్థులు సాంకేతికతపై పట్టు సాధించి సమాజానికి మేలుచేసే వినూత్నమైన ప్రాజెక్టులను చేపట్టి సమస్యలకు పరిష్కార మార్గాలను కనుగొనాలని ఏపీఎస్సీహెచ్‌ఈ చైర్మన్ కె.హేమచంద్రారెడ్డి సూచించారు. వర్శిటీలోని అలుమిని ఆడిటోరియంలో సీఎస్‌ఈ విభాగం ఆధ్వర్యంలో కంప్యూటర్ విజన్, హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్, స్మార్ట్ డివైజస్, నెట్‌వర్క్స్ (సీహెచ్‌ఎస్‌ఎన్ 2020) అంశంపై రెండు రోజుల పాటు నిర్వహించే అంతర్జాతీయ సదస్సును సోమవారం ఆయన ప్రారంభించారు. రిజిసా్ట్రర్ ప్రొఫెసర్ సీహెచ్ సత్యనారాయణ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా హేమచంద్రారెడ్డి, విశిష్ట అతిథులుగా జేఎన్టీయూకే వీసీ రామలింగరాజు, మాజీ వీసీ అల్లం అప్పారావు, రాయలసీమ యూనివర్సిటీ వీసీ ఎ.ఆనందరావు, గౌరవ అతిథులుగా రెక్టార్ జీవీఆర్ ప్రసాదరాజు, ప్రిన్సిపాల్ బాలకృష్ణ పాల్గొనగా హరిత కన్వీనర్‌గా వ్యవహరించారు. హేమచంద్రారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు ముఖ్యంగా స్కిల్ ఓరియంటెడ్ కోర్సులను అందించాలని, పరిశోధనలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. వీసీ రామలింగరాజు మాట్లాడుతూ అధ్యాపకులు, పరిశోధక విద్యార్ధులకు ఇటువంటి సదస్సులు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. అల్లం అప్పారావు మాట్లాడుతూ అమెరికా వంటి దేశాల్లోని మల్టీ నేషనల్ కంపెనీలను భారతీయులు తమ సాంకేతికబలంతో ముందుండి నడిపిస్తున్రన్నారు. జేఎన్టీయూహెచ్, సింగపూర్, మలేషియా, బంగ్లాదేశ్ విశ్వవిద్యాలయాల నుంచి ప్రొఫెసర్లు ఆన్‌లైన్ విధానంలో సదస్సులో పాల్గొన్నారు. రిజిస్ట్రార్ మాట్లాడుతూ ప్రపంచం నలుమూలల నుంచి సుమారు 200 మందికి పైగా ప్రతినిధులు వర్చువల్ విధానంలో సదస్సులో పాల్గొన్నారని తెలిపారు. అనంతరం పరిశోధనల్లో ఉత్తమ ప్రతిభ కనబరచిన అధ్యాపకులకు యంగ్ రీసెర్చ్, బెస్ట్ రీసెర్చ్ అవార్డులను ప్రదానం చేశారు. సదస్సు సావనీర్‌ను అతిథులు ఆవిష్కరించగా డైరెక్టర్లు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Updated Date - 2020-12-29T06:23:57+05:30 IST